Daily Current Affairs in Telugu: 23 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు.
2. ప్రతిష్ఠాత్మక గాంధీ శాంతి పురస్కార గ్రహీత ఎంపిక కమిటీ సభ్యుడిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నియమితులయ్యారు.
Daily Current Affairs in Telugu: 21 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ శనివారం అమెరికాలో హార్వర్డ్ లా స్కూల్ గ్లోబల్ లీడర్‌షిప్ అవార్డు అందుకున్నారు.
4. ఇరానీ మహిళ మహసా అమినీ కస్టడీ మరణంపై రిపోర్టింగ్ చేసినందుకు సదరు మహిళా జర్నలిస్టులు ఆలాహే మొహమ్మది (36), నిలోఫర్ హమెదీ (31)లకు ఇరాన్ ఏడేళ్ల జైలు శిక్ష విధించింది.
Daily Current Affairs in Telugu: 20 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. కెనడా వేదికగా జరిగిన ఓల్డ్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్ షిప్‌లో భూపతిరాజు అన్మిష్ వర్మ గోల్డ్‌మెడల్‌తో మెరిశాడు. మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ పోటీల్లో భారత్ తరపున 75 కిలోల విభాగంలో ఆన్మిష్ బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.
6. ఇటలీలో జరిగిన ఒల్బియా ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టోర్నీలో రిత్విక్ చౌదరీ–అర్జున్ ఖడే (భారత్) జోడీ విజేతగా నిలిచింది.
7. బ్యాంకాక్‌లోని హువా హిన్‌లో ముగిసిన ఐటీఎఫ్ డబ్ల్యూ15 టోర్నీలో భమిడిపాటి శ్రీవల్లి రష్మిక రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది.
Daily Current Affairs in Telugu: 19 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్