Daily Current Affairs in Telugu: 20 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. ఇరాన్ మహిళ మహ్సా అమిని(22)కి యూరోపియన్ యూనియన్ అత్యున్నత మానవ హక్కుల పురస్కారం సఖరోవ్‌ని ప్రకటించింది.
2. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టబోయే మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టుకు ముందు క్రూ మాడ్యూల్ సిస్టం (వ్యోమగాముల గది)తో కూడిన గగన్‌యాన్ టెస్ట్ వెహికల్ అబార్ట్ మిషన్ (టీవీ–డీ1)ను ఈనెల 21న ఉదయం 7 గంటలకు నింగిలోకి పంపడానికి శాస్త్రవేత్తలు అంతా సిద్ధం చేశారు.
Daily Current Affairs in Telugu: 19 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్ కమిటీ) తాజాగా వెల్లడించిన మెంబర్ క్లాస్ ఆఫ్ యాక్టర్స్ జాబితాలో ఎన్టీఆర్‌కు చోటు దక్కింది.
4. మహాత్మా గాంధీ 8 అడుగుల విగ్రహాన్ని దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో ఉన్న టాల్‌స్టాయ్‌ఫార్మ్‌లో ఆవిష్కరించారు.
Daily Current Affairs in Telugu: 16 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
5. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మరియు ఇతర అంతర్జాతీయ సంస్థలకు భారత తదుపరి శాశ్వత ప్రతినిధిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ నియమితులయ్యారు .
6. భారత దేశ వృద్ధి రేటును ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి (2023–24) గాను 6.3 శాతంగా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది.
Daily Current Affairs in Telugu: 14 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్