Daily Current Affairs in Telugu: 19 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నూనెపల్లి హరినాథ్, మండవ కిరణ్మయి, జగడం సుమతి, న్యాపతి విజయ్ నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఆమోద ముద్ర వేశారు.
2. తెలంగాణకు చెందిన బీజేపీ సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డిని త్రిపుర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఒడిశా గవర్నర్‌గా జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రఘుబర్‌దాస్‌ను నియమించారు.
Daily Current Affairs in Telugu: 16 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. జాతీయ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు చెందిన వీసారపు ఇందు రజత పతకం గెలుచుకుంది.
4. హాలీవుడ్ నటుడు, నిర్మాత మైఖేల్ డగ్లస్ సత్యజిత్ రే జీవిత సాఫల్య పురస్కారానికి ఎంపికయ్యారు.
5. నేపాల్, మలేషియా, ఫిలిప్పైన్స్, సీషెల్స్, కామెరూన్, ఐవొరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా దేశాలకు బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేయవచ్చని కేంద్ర ప్రభుత్వం అనుమతించింది.
Daily Current Affairs in Telugu: 14 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. స్వలింగ వివాహాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ప్రత్యేక వివాహాల చట్టం ప్రకారం అలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పించేందుకు నిరాకరించింది.
7. విశాఖపట్నం పోర్టు అథారిటీకి సంబంధించిన పలు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు.
8. టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 2023 సెప్టెంబర్‌లో (2022 ఇదే నెలతో పోల్చి) మైనస్ (–) 0.26 శాతంగా నమోదయ్యింది.
Daily Current Affairs in Telugu: 10 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్