Daily Current Affairs in Telugu: 14 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. క్రిప్టో ఆస్తులపై జీ20 రోడ్‌మ్యాప్‌కు సంబంధించి అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్), ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డ్ (ఎఫ్‌ఎస్‌బీ) సంయుక్తంగా రూపొందించిన సింథసిస్ పేపర్‌ను జీ20 ఆర్థికమంత్రులు ఆమోదించారు.
2. క్రికెట్ సహా మరో నాలుగు క్రీడలు బేస్‌బాల్–సాఫ్ట్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోసి (సిక్సెస్), స్క్వాష్ ఆటలు 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో చేర్చే ప్రతిపాదనల్ని ఐఓసీ ఎగ్జిక్యూటీవ్ బోర్డు ఆమోదించింది. ఐఓసీ అధ్యక్షుడు థామస్ బాచ్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది.
Daily Current Affairs in Telugu: 10 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లుగా ఉంది.
4. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికత భారత్‌లో కొత్త అవకాశాలను తెచ్చిపెడుతుందని అంతర్జాతీయ జాబ్ సైట్ ఇండీడ్ నివేదిక తెలిపింది.
5. పుదుచ్చేరిలోని ఏకైక దళిత, మహిళా ఎమ్మెల్యే సి. చంద్ర ప్రియాంక తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Daily Current Affairs in Telugu: 09 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
6. ప్రపంచ ఆకలి సూచీ –2023లో భారత్ 111వ స్థానంలో నిలిచింది.
7. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ దేశీ కుబేరుల జాబితాలో అగ్రస్థానంలో నిల్చారు. 2023 సంవత్సరానికి గాను భారత్‌లోని 100 మంది సంపన్నులతో ఫోర్బ్స్ రూపొందించిన జాబితాలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నారు.
Daily Current Affairs in Telugu: 07 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
8. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(నాసా) తాజాగా అంగారక గ్రహం- బృహస్పతి మధ్యనున్న 16 సైక్ అనే ఒక భారీ లోహ గ్రహశకలాన్ని చేరుకునేందుకు ఉద్దేశించిన మిషన్‌పై పని చేస్తోంది.
9. ఇజ్రాయెల్ నుంచి తిరిగి రావాలనుకునే భారత పౌరుల కోసం ‘ఆపరేషన్ అజయ్’ను ప్రారంభిస్తున్నట్లు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రకటించారు.
Daily Current Affairs in Telugu: 06 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్