Skip to main content

Daily Current Affairs in Telugu: 07 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
7th October Daily Current Affairs in Telugu,sakshi education,gk updates
7th October Daily Current Affairs in Telugu

1. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఇరిగేషన్‌ అండ్‌ డ్రైనేజ్‌ (ఐసీఐడీ) ఎంపిక చేసింది.

2. ఆసియా క్రీడల్లో బొమ్మదేవర ధీరజ్, అతాను దాస్, తుషార్‌లతో కూడిన జట్టు రికర్వ్‌ టీమ్‌ విభాగంలో భారత్‌కు తొలిసారి రజత పతకం అందించింది.

Daily Current Affairs in Telugu: 06 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

3. ఆసియా క్రీడల రెజ్లింగ్‌లో అమన్‌ (57 కేజీలు), మహిళల విభాగంలో సోనమ్‌ మలిక్‌ (62 కేజీలు), కిరణ్‌ (76 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు.

4. ఆసియా క్రీడల సెపక్‌తక్రా ఈవెంట్‌లో  ఐక్‌పమ్‌ మైపాక్‌దేవి, ఒయినమ్‌ చవోబా దేవి, ఖుష్బూ, ఎలాంగ్‌బమ్‌ ప్రియాదేవి, ఇలాంగ్‌బమ్‌ లెరెంతోంబి దేవిలతో కూడిన భారత జట్టు కాంస్య పతకం కైవసం చేసుకుంది.

5. ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్‌ జట్టు  పసిడి పతకం గెలిచింది.

Daily Current Affairs in Telugu: 05 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

6. ఆసియా క్రీడల్లో పురుషుల కబడ్డీలో భారత్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించింది.

7. పురుషుల బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో భారత జోడీ చిరాగ్‌ షెట్టి, సాత్విక్‌ సాయిరాజ్‌ గోల్డ్‌ మెడల్‌ కైవసం చేసుకుంది. 

8. ఆసియా క్రీడల్లో పురుషల కాంపౌండ్‌ ఈవెంట్‌లో ఓజస్ ప్రవీణ్ గోల్డ్‌ మెడల్‌ సాధించగా, మహిళల కాంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో జ్యోతి సురేఖ పసిడి పతకం కైవసం చేసుకుంది.

04 October Daily Current Affairs in Telugu: 04 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 09 Oct 2023 07:55AM

Photo Stories