Skip to main content

Daily Current Affairs in Telugu: 05 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
05 October Daily Current Affairs in Telugu, sakshi education, exam tips
05 October Daily Current Affairs in Telugu

1. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటయ్యే దాదాపు రూ.3,008 కోట్ల విలువైన 13 ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభోత్సవాలు, భూమి పూజ కార్యక్రమాలను నిర్వహించారు.

2. హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హాల్‌) మొట్ట మొదటి రెండు సీట్లున్న తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ను బుధవారం భారత వైమానిక దళానికి అప్పగించింది.

3. ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ విభాగంలో వెన్నంజ్యోతి సురేఖ–ఓజస్‌ ప్రవీణ్‌ దేవ్‌తలే (భారత్‌) జోడీ స్వర్ణ పతకాన్ని సాధించింది.

04 October Daily Current Affairs in Telugu: 04 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

4. ఆసియా క్రీడల్లో మహిళల 75 కేజీల విభాగంలో లవ్లీనా బొర్గోహైన్‌ రజత పతకంతో సరిపెట్టుకుంది. లీ కియాన్‌ (చైనా)తో జరిగిన ఫైనల్లో ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లవ్లీనా 0–5తో ఓడిపోయింది.

5. ఆసియా క్రీడల్లో మహిళల 57 కేజీల విభాగం సెమీఫైనల్లో పర్వీన్‌ హుడా 0–5తో లిన్‌ యు టింగ్‌ (చైనీస్‌ తైపీ) చేతిలో ఓడిపోయి కాంస్య పతకం సాధించింది. 

6. ఆసియా క్రీడల  పురుషుల రెజ్లింగ్‌లో 87 కేజీల విభాగంలో సునీల్‌ కుమార్‌ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు. 

03 October Daily Current Affairs in Telugu: 03 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

7. 2023 సంవత్సరానికి గానూ సాహిత్యంలో నోబెల్ బహుమతి నార్వేజియన్ రచయిత జాన్‌ ఫోసెను వ‌రించింది.

8. ఆసియా క్రీడల్లో పురుషుల 4*400 మీటర్ల రిలే ఈవెంట్‌లో మొహమ్మద్‌ అనస్, అమోజ్‌ జేకబ్, అజ్మల్, రాజేశ్‌ రమేశ్‌లతో కూడిన భారత బృందం స్వర్ణ పతకం గెలిచింది.  ఐశ్వర్య మిశ్రా, శుభ వెంకటేశ్, ప్రాచీ, విత్యా రామ్‌రాజ్‌లతో కూడిన భారత మహిళల జట్టు 4*400 మీటర్ల రిలేలో రజత పతకం గెలిచింది.

9. ఆసియా క్రీడల్లో పురుషుల 5000 మీటర్ల విభాగంలో అవినాశ్‌ సాబ్లే (13ని:21.09 సెకన్లు) రజత పతకం గెలిచాడు. మహిళల 800 మీటర్ల ఫైనల్‌ రేసును భారత అథ్లెట్‌ హర్‌మిలన్‌ బైన్స్‌ 2ని:03.75 సెకన్లలో పూర్తి చేసి రజత పతకంకైవసం చేసుకుంది. 35 కిలోమీటర్ల నడక మిక్స్‌డ్‌ విభాగంలో మంజు రాణి, రాంబాబు జోడీ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించింది.  

02 October Daily Current Affairs in Telugu: 02 అక్టోబ‌ర్‌ 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 06 Oct 2023 08:12AM

Photo Stories