04 October Daily Current Affairs in Telugu: 04 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. భారతదేశ తొలి బధిర మహిళా అడ్వకేట్ సారా సన్నీ తాజాగా సుప్రీం కోర్టులో సైన్ లాంగ్వేజ్‌లో వాదన వినిపించింది.
2. ఆసియా క్రీడల బాక్సింగ్ ఈవెంట్‌లో మహిళల 54 కేజీల విభాగంలో ప్రీతి పవార్... పురుషుల ప్లస్ 92 కేజీల విభాగంలో నరేందర్ సెమీఫైనల్ బౌట్‌లలో ఓడిపోయి కాంస్య పతకాలను సొంతం చేసుకున్నారు.
3. ఆసియా క్రీడల్లో అర్జున్ సింగ్–సునీల్ సింగ్ ఆసియా క్రీడల పురుషుల డబుల్స్ కనోయ్ 1000 మీటర్ల స్ప్రింట్ ఈవెంట్‌లో భారత్‌కు కాంస్య పతకం అందించారు.
03 October Daily Current Affairs in Telugu: 03 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
4. ఆసియా క్రీడల్లో 5000 మీటర్ల రేసులో ఉత్తరప్రదేశ్‌కు చెందిన పారుల్ చౌధరీ 15 నిమిషాల 14.75 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని గెలిచింది.
5. ఆసియా క్రీడల్లో జావెలిన్ త్రోయర్ అన్ను రాణి తొలిసారి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది.
6. ఆసియా క్రీడల్లో మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విత్యా రామ్‌రాజ్ కాంస్య పతకాన్ని సాధించింది. పురుషుల 800 మీటర్ల విభాగంలో మొహమ్మద్ అఫ్జల్ రజత పతకం గెలిచాడు. పురుషుల ట్రిపుల్ జంప్‌లో ప్రవీణ్ చిత్రావెల్ భారత్‌కు కాంస్య పతకాన్ని అందించాడు.
02 October Daily Current Affairs in Telugu: 02 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
7. ఆసియా క్రీడల్లో డెకాథ్లాన్‌లో ఢిల్లీకి చెందిన తేజస్విన్ శంకర్ 7666 పాయింట్లతో కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడంతోపాటు రజత పతకాన్ని సాధించాడు.
8. 2023 ఇరానీ ట్రోఫీని రెస్ట్ ఆఫ్ ఇండియా గెలుచుకుంది.
9. 2023 సంవత్సరానికిగాను రసాయన శాస్త్రంలో అమెరికాకు చెందిన మౌంగి జి. బావెండి, లూయిస్ ఇ. బ్రస్, అలెక్సీ ఐ. ఎకిమోవ్‌లకు నోబెల్ ప్రైజ్ ప్రకటించారు.
30 September Daily Current Affairs in Telugu: 30 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
10. భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2023–24) 6.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంటుందన్న తన అంచనాలను ప్రపంచ బ్యాంక్ పునరుద్ఘాటించింది.
11. ఆసియా క్రీడల్లో పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు.
29 September Daily Current Affairs in Telugu: 29 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్