30 September Daily Current Affairs in Telugu: 30 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
1. ఆసియా క్రీడల స్క్వాష్ క్రీడాంశంలో జోష్నా చినప్ప, తన్వీ ఖన్నా, అనాహత్ సింగ్, దీపిక పల్లికల్‌లతో కూడిన భారత మహిళల జట్టు సెమీఫైనల్లో 1–2తో డిఫెండింగ్ చాంపియన్ హాంకాంగ్ జట్టు చేతిలో ఓడిపోయి కాంస్య పతకాన్ని దక్కించుకుంది.
2. ఆసియా క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్ ఈవెంట్‌లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, స్వప్నిల్ కుసాలె, అఖిల్ షెరాన్‌లతో కూడిన భారత జట్టు 1769 పాయింట్లు స్కోరు చేసి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. వ్యక్తిగత ఈవెంట్లలో టాప్–8లో నిలిచిన షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ 459.7 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెల్చుకున్నాడు.
3. ఆసియా క్రీడల్లో మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ టీమ్ ఈవెంట్లలో భారత షూటర్లు పలక్, ఇషా సింగ్, దివ్యలతో కూడిన భారత జట్టు 1731 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం దక్కించుకుంది. వ్యక్తిగత ఈవెంట్లలో ఎనిమిది మంది షూటర్ల మధ్య ఎలిమినేషన్ పద్ధతిలో జరిగిన ఫైనల్లో పలక్ 242.1 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకం సొంతం చేసుకోగా... ఇషా సింగ్ 239.7 పాయింట్లతో రజత పతకాన్ని గెల్చుకుంది.
29 September Daily Current Affairs in Telugu: 29 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
4. ఆసియా క్రీడల్లో టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న, రుతుజా జోడీ పసిడి పతకం కైవసం చేసుకుంది.
5. ఆసియా క్రీడల్లో టెన్నిస్ డబుల్స్ విభాగంలో సాకేత్ మైనేని–రామ్‌కుమార్ రామనాథన్ జంట భారత్‌కు రజత పతకం అందించింది.
6. విశ్వంలో సుదూరంలో ఉన్న నక్షత్రాలు తదితరాల రసాయన విశ్లేషణ ద్వారా వాటి లోగుట్టును కనిపెట్టేందుకు అత్యధిక సామర్థ్యంతో కూడిన జయింట్ మగలాన్ టెలీస్కోప్ (జీఏంటీ) నాసా ఆధ్వర్యంలో సిద్ధమవుతోంది.
Daily Current Affairs in Telugu: 28 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్
7. ఆసియా క్రీడల అథ్లెటిక్స్ మహిళల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన 24 ఏళ్ల కిరణ్ బలియాన్ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది.
8. ఆసియా క్రీడల్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షుటర్లు సరబ్జోత్ సింగ్, దివ్యతో కూడిన భారత ద్వయం రెండో స్ధానంలో నిలిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు.
Daily Current Affairs in Telugu: 27 సెప్టెంబరు 2023 కరెంట్ అఫైర్స్