Skip to main content

Daily Current Affairs in Telugu: 27 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

వివిధ పోటీ ప‌రీక్ష‌ల‌కు ప్రిపేర‌య్యే విద్యార్ధుల‌ కోసం సాక్షి ఎడ్యుకేష‌న్‌ అందించే డైలీ క‌రెంట్ అఫైర్స్‌.
 27 September Daily Current Affairs in Telugu, Current Affairs Updates, sakshi education,
27 September Daily Current Affairs in Telugu

1. ఆసియా క్రీడల్లో సెయిలింగ్‌లో   భారత్‌కు రెండు పతకాలు లభించాయి. భోపాల్‌కు చెందిన 17 ఏళ్ల నేహా ఠాకూర్‌ బాలికల డింగీ ఐఎల్‌సీఏ–4 ఈవెంట్‌లో రెండో స్థానం సంపాదించి రజత పతకం గెల్చుకుంది. అయోధ్యకు చెందిన 29 ఏళ్ల ఇబాద్‌ అలీ విండ్‌సర్ఫర్‌ ఆర్‌ఎస్‌:ఎక్స్‌ ఈవెంట్‌లో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించాడు.

2. ఆసియా క్రీడలు-2023 50 మీటర్ల రైఫిల్‌ విభాగం(3 పొజిషన్స్‌)లో భారత మహిళా జట్టు   సిఫ్ట్‌కౌర్‌ సమ్రా, మనిని కౌశిక్‌, ఆషి చోక్సీ  భారత్‌కు రజతం అందించారు.

3. ఎంఐటీ, యూనివర్శిటీ ఆఫ్ ఫ్లోరిడా, బ్రెజిల్ పరిశోధకులు భూమిపై  అమెజాన్‌లో డార్క్‌ ఎ‍ర్త్‌ను కనుగొన్నారు.

Daily Current Affairs in Telugu: 26 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

4. ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌ క్రీడాంశంలో భారత బృందం విపుల్‌ హృదయ్‌ చడ్డా, అనూష్‌ అగర్‌వల్లా, దివ్యాకృతి సింగ్, సుదీప్తి హజేలాలతో కూడిన భారత జట్టు 209.205 పాయింట్లు సాధించి పసిడి పతకం సొంతం చేసుకుంది.

5. హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఐదోసారి ప్రతిష్టాత్మక ‘నేషనల్‌ ఎనర్జీ లీడర్‌’  ఏడవసారి ‘ఎక్సలెంట్‌ ఎనర్జీ ఎఫిషియెన్సీ యూనిట్‌’ అవార్డు లభించింది.

Daily Current Affairs in Telugu: 25 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

6. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరుకు చెందిన రేపాక రఘునందన్‌కు ఆంధ్రప్రదేశ్‌ బహుజన రచయితల వేదిక గుర్రం జాషువా జాతీయ సాహితీ
పురస్కారానికి ఎంపిక చేసింది. 

7. ఎకనమిక్‌టైమ్స్‌ ఎడ్జ్‌ ‘ఐకానిక్‌ బ్రాండ్‌ ఆఫ్‌ ఇండియా–2023’ అవార్డు శ్రీసిటీని వరించింది.

Daily Current Affairs in Telugu: 22 సెప్టెంబ‌రు 2023 క‌రెంట్ అఫైర్స్

Published date : 28 Sep 2023 08:16AM

Photo Stories