Daily Current Affairs in Telugu: 21 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
1. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్‌యాన్ మిషన్‌లో తొలి పరీక్ష ‘టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్’(టీవీ-డీ1)ప్రయోగం విజయవంతమైంది.
2. చండీగఢ్, ముంబై, బెంగళూరుల్లోని కాన్సులేట్లలో ఇన్ పర్సన్ సేవలను నిలిపేసిన కెనడా.
Daily Current Affairs in Telugu: 20 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్
3. ఖేలో ఇండియాలో భాగంగా హర్యానాలో 15 ఖేలో ఇండియా కేంద్రాలను హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్, కేంద్ర క్రీడలశాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రారంభించారు.
4. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) నిర్వహించే సామాజిక భద్రత పథకం కిందకు ఆగస్ట్ మాసంలో 16.99 లక్షల మంది కొత్త సభ్యులు నికరంగా వచ్చి చేరారు.
5. రిటైర్మెంట్ తరువాతి పెన్షన్ల వ్యవస్థల్లో భారత్ స్థానం మరింత దిగజారింది. మొత్తం 47 దేశాలతో కూడిన గ్లోబల్ పెన్షన్ ఇండెక్స్ జాబితాలో ఏకంగా 45వ స్థానానికి పడిపోయింది.
Daily Current Affairs in Telugu: 19 అక్టోబర్ 2023 కరెంట్ అఫైర్స్