Skip to main content

Russia Visa: ఇక‌పై ర‌ష్యాకు ఈజీగా వెళ్లొచ్చు... అయితే

రష్యా వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త. భారత్‌తో పాటు మరో 5 దేశాలకు చెందిన అర్హులైన పౌరులకు వీసాలను తక్షణమే జారీ చేసేలా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.
MODI - PUTIN

వీసాల మంజూరులో కాలయాపనకు స్వ‌స్తి ప‌లికేలా, త్వరగా వీసా పొందేలా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు రష్యా డిప్యూటీ విదేశాంగ మంత్రి ఇగోర్ ఇవానోవ్ వెల్ల‌డించారు. వీసాల‌ జారీలో రష్యా ప్రభుత్వం భారత్‌తో పాటు అంగోలా, వియత్నాం, ఇండోనేషియా, సిరియా, ఫిలిప్పీన్స్‌లతో కలిసి పని చేస్తోందని ఇవనోవ్ చెప్పారు.
మ‌రో 11 దేశాల‌తో....
ఇంతకుముందు, రష్యా వీసా- ఫ్రీ ట్రిప్స్‌ కోసం సౌదీ అరేబియా, బార్బడోస్, హైతీ, జాంబియా, కువైట్, మలేషియా, మెక్సికో, ట్రినిడాడ్‌తో సహా 11 దేశాలతో వీసా రహిత పర్యటనలపై రష్యా అంతర్ ప్రభుత్వ ఒప్పందాలను సిద్ధం చేస్తోందని ఇవనోవ్ తెలిపారు.

చ‌ద‌వండి:  ప్ర‌భుత్వ మ‌ద్ద‌తుతోనే... భారీగా పెట్టుబ‌డులు

చ‌ద‌వండి: ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతం అత్యంత భద్రం, సురక్షితం

Published date : 06 Mar 2023 03:55PM

Photo Stories