Unclaimed money: బ్యాంకుల్లో పేరుకుపోయిన 35 వేల కోట్లు... ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు
ప్రస్తుత కాలంలో చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరికి బ్యాంకు అకౌంట్ తప్పనిసరిగా ఉంటోంది. అధిక సంఖ్యలో బ్యాంకులు తమ ఖాతాదారులు కచ్చితంగా మినిమం బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను అమలు చేస్తున్నాయి. మినిమం బ్యాలెన్స్ లేని అకౌంట్లకు ఫైన్ కూడా వేస్తాయి. ఈ విషయాలన్నీ మనకు తెలిసినవే. అలాగే ఒక్కో వ్యక్తికి ఒకటికి మించి ఖాతాలు కూడా ఉంటున్నాయి. మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే వారి ఖాతాల్లో డబ్బులు అలాగే ఉంటున్నాయి. పెద్ద మొత్తంలో ఉంటే వాటిని క్లెయిమ్ చేసుకుంటారు కుటుంబ సభ్యులు.
చదవండి: వీఆర్‌వోలకు గుడ్ న్యూస్... ప్రమోషన్లకు మార్గం సుగమం
స్పందించిన ఆర్బీఐ...!
కానీ, చాలామంది అలాగే వదిలేస్తున్నారు. చనిపోయిన వ్యక్తికి ఏ బ్యాంకులో ఖాతా ఉందో తెలియకపోవడం కూడా ఒక కారణం. ఇలా క్లెయిమ్ చేసుకోని డబ్బంతా బ్యాంకుల వద్ద పేరుకుపోయింది. అది కాస్త రూ.35,012 కోట్లకు చేరింది. దీనిపై కొంతమంది సుప్రీంను ఆశ్రయించగా.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్బీఐ స్పందించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
10 ఏళ్లుగా అలాగే...
క్లెయిమ్ చేయని డిపాజిట్లపై ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ ప్రకటన చేశారు. బ్యాంక్‌లో డిపాజిట్ చేసిన మొత్తాన్ని డిపాజిటర్లు, లేదంటే లబ్ధిదారులు గుర్తించేందు వెబ్‌పోర్టల్‌లో ప్రత్యేక డేటాబేస్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్‌బీఐ వివరాల ప్రకారం.. ఆర్‌బీఐ డిపాజిటర్స్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌లో రూ. 35,012 కోట్లు ఉన్నాయి. దాదాపు 10 ఏళ్లుగా వీటిని ఎవరూ క్లెయిం చేయలేదు. అంటే ఈ మొత్తం ఇప్పటికే అనేక కుటుంబాలకు చేరి ఉండాల్సింది. కానీ, ఆయా ఫ్యామిలీలకు ఈ విషయం తెలియకపోవడం వల్లే నిధులు పేరుకుపోయాయి.
చదవండి: అయ్యో పాపం... చేరిన ప్రతీ కంపెనీలోనూ మొండిచేయే...
డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ
ఇటీవల అన్ క్లయిమ్ డిపాజిట్లపై కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కరాద్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ.. ప్రభుత్వ బ్యాంకుల్లో క్లయిం చేయని డిపాజిట్లు పేరుకుపోయాయని వాటిని ఆర్‌బీఐ ఆధ్వర్యంలోని ‘డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్’కు బ్యాంకులు బదిలీ చేసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ నిర్వహించిన తొలి ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశంలో గవర్నర్ శక్తికాంత్ దాస్ మాట్లాడుతూ.. అన్ క్లయిమ్ డిపాజిట్ల కోసం వెబ్ పోర్ట్‌లలో డేటాబేస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆయా బ్యాంక్‌లు ఆ డేటా బేస్‌లో అన్ క్లయిమ్ డిపాజట్ల గురించి తెలుసుకునేలా వీలు కల్పించనున్నట్లు తెలిపారు.