Jagdambika Pal: జేపీసీ చీఫ్‌గా బీజేపీ ఎంపీ జగదాంబికా పాల్
ఈ కమిటీ చైర్‌పర్సన్‌గా బీజేపీ నేత జగదాంబికా పాల్‌ను స్పీకర్ ఓం బిర్లా నియమించారు.
ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల సందర్బంగా వక్ఫ్ సవరణ బిల్లు-2024పై చర్చ జరిగింది. ఈ క్రమంలో ప్రతిపక్ష నేతల డిమాండ్ మేరకు కేంద్రం జేపీసీని ఏర్పాటు చేసింది.
అనంతరం బిల్లుపై అధ్యయనానికి 31 మంది సభ్యులతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి ఛైర్మన్‌గా జగదాంబికా పాల్ వ్యవహరించనున్నారు. కమిటీలోని 31 మందిలో 21 మంది లోక్‌సభ సభ్యులుకాగా, 10 మంది రాజ్యసభ ఎంపీలని లోక్‌సభ సెక్రటేరియట్ ఒక నోటిఫికేషన్‌లో వెల్లడించింది.
జేపీసీలో సభ్యులు వీరే..
లోక్‌సభ నుంచి ఎన్డీయే కూటమికి చెందిన వారు 12 మంది ఉండగా.. విపక్ష సభ్యులు తొమ్మిది మంది ఉన్నారు. మరోవైపు.. రాజ్యసభ నుంచి జేపీసీలో బీజీపీ నుంచి నలుగురు, విపక్షాల నుంచి నలుగురు, ఒక నామినేటెడ్ సభ్యుడు ఉన్నారు.