Skip to main content

UPSC Chairman : యూపీఎస్సీ నూతన చైర్మన్‌గా డా.మనోజ్‌ సోనీ

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నూత‌న చైర్మన్‌గా ప్రముఖ విద్యావేత్త మనోజ్‌ సోనీ మంగళవారం ప్రమాణస్వీకారం చేశారు. 2017 జూన్ 28వ తేదీన క‌మిష‌న్‌లో సభ్యుడిగా చేరిన ఆయన.. గతేడాది ఏప్రిల్‌ 5 నుంచే యూపీఎస్సీ చైర్మన్‌ హోదాలో పనిచేస్తున్నారు.
Manoj Soni
Manoj Soni

యూపీఎస్సీలో సీనియ‌ర్ స‌భ్యురాలైన స్మితా నాగ‌రాజ్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప‌లు యూనివర్సిటీల్లో వీసీగా కూడా మ‌నోజ్ పనిచేశారు.

చ‌ద‌వండి: ఇప్పుడు టీ అమ్ముతూ 150 కోట్లు సంపాదిస్తున్నాడు... 20 ఏళ్ల‌కే షుగ‌ర్ రావ‌డంతో

2009 ఆగస్టు 1 నుంచి 2015 జులై 31 వరకు గుజరాత్‌లోని డా. బాబాసాహెబ్‌ అంంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో వీసీగా సేవలందించారు. అంతకముందు బరోడాలోని మహారాజా సాయాజిరావు యూనివర్సిటీలో ఏప్రిల్‌ 2005 నుంచి 2008 ఏప్రిల్‌ వరకు వీసీగా పనిచేశారు.

Manoj Soni

పొలిటికల్‌ సైన్స్‌లో స్కాలర్‌ అయిన సోనీ.. వీసీగా ఉన్న కాలం మినహా 1991 నుంచి 2016 వరకు గుజరాత్‌లోని ఆనంద్‌ జిల్లాలో వల్లభ్‌ విద్యానగర్‌లోని సర్దార్ పటేల్ యూనివర్శిటీ (SPU)లో ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ అంశాన్ని బోధించేవారు. 

☛ ఇండియాలో 500 మందిని తీసేసిన అమెజాన్‌... టోట‌ల్‌గా 9 వేల మందిపై వేటు

మహారాజా సాయాజీరావు వర్సిటీలో వీసీగా చేరినప్పుడు ఆయన అత్యంత పిన్న వయస్కుడైన వీసీగా రికార్డు నమోదు చేశారు.

Manoj Soni

ఐఏఎస్‌, ఐఎఫ్ఎస్‌, ఐపీఎస్‌, తదితర ఉద్యోగులను ఎంపిక చేసేందుకు యూపీఎస్సీ ఏటా సివిల్స్‌ సర్వీసెస్‌ పరీక్ష నిర్వహిస్తుంది. యూపీఎస్సీలో చైర్మన్‌తో పాటు 10మంది సభ్యులు ఉంటారు. ప్రస్తుతం ఐదుగురు సభ్యుల స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

Published date : 16 May 2023 06:12PM

Photo Stories