Amazon Layoffs: ఇండియాలో 500 మందిని తీసేసిన అమెజాన్... టోటల్‌గా 9 వేల మందిపై వేటు

అయితే తాను అనుకున్న మేరకు ఫలితాలు రాకపోవడంతో వాటినన్నింటిని వదిలించుకుంటోంది. ఈ విభాగాల్లో పనిచేసే ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తోంది. ఇప్పటికే ట్విట్టర్, మైక్రోసాఫ్ట్, మెటా, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేశాయి. ఆర్థిక మాంద్యం భయాలతో ఈ ఏడాది ఆరంభం నుంచి సుమారు 18 వేల మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించిన అమెజాన్.. తాజాగా మరోసారి లేఆఫ్స్‌కు సిద్ధమైంది.
చదవండి: సాఫ్ట్‌వేర్ జాబ్ దొరకడం ఇంత కష్టమా... 150 కంపెనీలకు అప్లై చేస్తే...!

రెండో విడత ఉద్యోగుల తొలగింపును మార్చి నెలలోనే కంపెనీ సీఈవో యాండీ జెస్సీ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 9 వేల మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశాలు ఉండటంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నామని... అందులో భాగంగా ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలిపారు. వచ్చే నెలలో (ఏప్రిల్ నుంచి) ఈ తొలగింపుల ప్రక్రియ ప్రారంభమవుతుందని చెప్పారు. త్వరలోనే దీనిపై ఉద్యోగులకు సమాచారం అందిస్తాం అని జెస్సీ తెలిపారు.

చదవండి: హాఫ్ జీతానికే పనిచేయండి... లేదంటే.. ప్రెషర్స్‌కు ఐటీ కంపెనీ భారీ షాక్
కంపెనీ నిర్ణయంతో భారత్‌లో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 500 మంది వరకు లేఆఫ్‌లకు గురవుతారని అంచనా. ఉద్యోగాలు కోల్పోతున్న వారిలో ఎక్కువ మంది వెబ్ సర్వీసెస్, హెచ్‌ఆర్, సహాయ విభాగానికి చెందిన వారు ఉన్నారు. మార్చి నెలలో 9 వేల మంది ఉద్యోగుల తొలగిస్తామని సంస్థ చేసిన ప్రకటనలో భాగంగానే ఇండియాలో ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు అందజేశారు.

చదవండి: ఉద్యోగుల తొలగింతతో పాటు బోనస్‌లోనూ తీవ్ర కోతలు... హడళెత్తిపోతున్న ఉద్యోగులు
తాజా లేఆఫ్స్‌తో ఈ సంవత్సరం ఇప్పటివరకు అమెజాన్ 27,000 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించినట్లయింది. గతంలో తొలగించిన 18,000 మందిలో రిటైల్, డివైజెస్, నియామకాలు, మానవ వనరుల విభాగాలకు చెందినవారు ఉన్నారు. తాజాగా 9 వేల మంది. ఈ తొలగింపులు ఇలానే కొనసాగే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.