Skip to main content

MLC Elections: ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఓ ప్ర‌హ‌స‌నం... ఎలా లెక్కిస్తారో తెలుసా?

సాధార‌ణంగా ఓట్ల లెక్కింపు ఎలా చేప‌డ‌తారో అంద‌రికీ ఐడియా ఉండే ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ, స‌ర్పంచ్‌, కౌన్సిల‌ర్ ఇలా ఏదైనా ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ను లెక్కించే విధానం ప్ర‌జ‌ల‌కు తెలుసు. కానీ, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఎలా లెక్కిస్తారో మ‌న‌లో చాలామందికి అవ‌గాహ‌న ఉండ‌దు. మొద‌టి ప్రాధాన్య‌త‌, రెండో ప్రాధాన్య‌త‌, మూడో ప్రాధాన్య‌త ఓట్లు అని గంద‌ర‌గోళంగా ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌ను ఎలా లెక్కిస్తారో తెలుసుకుందామా.!
MLC Elections

పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్పీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు భిన్నంగా ఉంటుంది. అభ్యర్థి గెలవాలంటే పోలైన ఓట్లలో చెల్లని ఓట్లు తీసివేయగా.. చెల్లిన ఓట్లలో ప్రాధాన్యతా పద్ధతిలో 50 శాతంపైన ఒక ఓటు అధికంగా రావాలి. పట్టభద్ర ఎమ్మెల్సీకి 2,45,576, ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి 25,887 ఓట్లు పోలయ్యాయి.
- తొలుత మొదటి ప్రాధాన్యత (1) ఓట్లు ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కిస్తారు. ఈ దశలో ఎవరైనా 50 శాతంపైన ఒక ఓటు ఎక్కువ సాధిస్తే ఆ అభ్యర్థిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అప్పుడు 2వ, 3వ, 4వ ప్రాధాన్యత ఓట్లు లెక్కించాల్సిన అవసరమే ఉండదు.

చ‌ద‌వండి: 18 స్థానాల్లో 11 బీసీల‌కే... టీడీపీలో ఓసీల‌కే పెద్ద‌పీట వేశారు
- మొదటి ప్రాధాన్యత (1) ఓట్లు ఎవరికీ 50 శాతంపైన ఒక ఓటు రాకపోతే... మొదటి ప్రాధాన్యత ఓట్లు అందరికంటే తక్కువ వచ్చిన అభ్యర్థిని ఎలిమినేట్‌ (తొలగింపు) చేస్తారు. అతని రెండవ (2) ఓటును మిగిలిన వారికి ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. ఈ క్రమంలో ఎవరైనా అభ్యర్థికి 50 శాతంపైన ఒక ఓటు వస్తే గెలిచినట్లు ప్రకటిస్తారు. లేనిపక్షంలో లెక్కింపు కొనసాగిస్తారు.
- ఆ తరువాత తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తప్పించి అతని రెండవ (2) ఓట్లను మిగిలిని వారిలో ఎవరికి ఎన్ని వచ్చాయో లెక్కించి కలుపుతారు. అప్పుడూ ఎవరికీ 50 శాతంపైన ఒక ఓటు రాకపోతే.... అప్పటికే ఎలిమినేట్‌ అయిన ఇద్దరి మూడవ (3) ప్రాధాన్యత ఓట్లను లెక్కించి పై వారికి కలుపుతారు.

చ‌ద‌వండి:​​​​​​​ రూ.2 లక్షల 79వేల 279 కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌
- చెల్లిన ఓట్లలో 50 శాతంపై ఒక ఓటు వచ్చే వరకు ఆఖరు నుంచి తక్కువ ఓట్లు వచ్చిన వారి 2వ, 3వ, 4వ ఓట్లను ఒక క్రమంలో కలుపుతూ పోతారు.
- చివరిదాకా 50 శాతంపై ఒక ఓటు రాకపోతే... ఎలిమినేట్‌ కాని చివరి అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు.

Published date : 16 Mar 2023 11:50AM

Photo Stories