Chandra Grahan 2023: నేడు చంద్ర గ్రహణం.. ఎక్కడ కనిపిస్తుందంటే?
Sakshi Education
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈరోజు(మే 5వ తేదీ) చంద్ర గ్రహణం ఏర్పడటంతో ఆ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణ ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు. దీనికి సంబంధించి ఖగోళ శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..
ఖగోళంలో ఈ రోజు రాత్రి అద్భుతం ఆవిష్కృతం కానుంది. ‘పెనుంబ్లార్ లూనార్’గా పిలిచే చంద్ర గ్రహణం మే 5 తేదీ రాత్రి ఏర్పడనుందని ప్లానెటరీ సొసైటీ, ఇండియా డైరెక్టర్ ఎన్. రఘునందన్‌కుమార్ తెలిపారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి 8.42 నుంచి 1.04 గంటల వరకు గ్రహణం ఉంటుంది.
చదవండి: 65 లక్షల ప్యాకేజీతో అదరగొట్టిన ఎంబీఏ అమ్మాయి... అత్యధిక వేతనంతో రికార్డు
అయితే ఇది భారత్ కనిపించదు. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, అట్లాంటిక్ ప్రాంతాల్లో కనిపిస్తుంది. చంద్రగ్రహణ ప్రభావం భారత్‌లో ఉంటుందంటూ వస్తున్నవన్నీ వదంతులేనని నందన్‌కుమార్ స్పష్టం చేశారు. ముఖ్యంగా పుట్టబోయే బిడ్డలపై గ్రహణానికి సంబంధించిన హానికారక ప్రభావాలు ఉంటాయని చేసే ప్రచారాలను నమ్మొద్దని సూచించారు. ఈ ఏడాది ఇదే ఫస్ట్ చంద్రగ్రహణం.
Published date : 05 May 2023 03:40PM