Danish PM: ప్రధాని మోదీతో సమావేశమైన డెన్మార్క్ ప్రధాని పేరు?
భారత ప్రధాని నరేంద్ర మోదీతో డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్ సమావేశమయ్యారు. అక్టోబర్ 9న న్యూఢిల్లీలో జరిగిన ఈ భేటీలో ఇండో డెన్మార్క్ గ్రీన్ స్ట్రాటజిక్ భాగస్వామ్య పురోగతిని ఇరువురు నేతలు సమీక్షించారు. ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునర్వినియోగ ఇంధనాల విషయంలో సహకారాన్ని మరింత పెంచుకునేందుకు అంగీకరించారు. నాలుగు అంశాలపై రెండు దేశాల మధ్య ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా భారత్, డెన్మార్క్ దేశాలు 2020 ఏడాదిలో గ్రీన్‌స్ట్రాటజిక్ ఒప్పందాన్ని చేసుకున్నాయి.
యూకే ప్రధానితో చర్చలు
భారత్ అందజేస్తున్న కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను గుర్తిస్తూ యూకే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇరు దేశాల ప్రధానమంత్రులు నరేంద్ర మోదీ, బోరిస్ జాన్సన్ స్వాగతించారు. ఇరువురు నేతలు అక్టోబర్ 11న ఫోన్‌లో మాట్లాడుకున్నారు. అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ ప్రభుత్వంతో వ్యవహరించే విషయంలో ప్రపంచ దేశాలు పరస్పరం సహకరించుకోవాల్సిన అవసరం ఉందని వారిద్దరూ పేర్కొన్నారు. కోవిడ్–19 మహమ్మారిపై కలిసికట్టుగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. .‘భారత్–యూకే రోడ్‌మ్యాప్ 2030’ ప్రగతిని సమీక్షించారు.
చదవండి: రక్షణ రంగ సాంకేతికత అంశంలో ఒప్పందం చేసుకున్న దేశాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : భారత ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం
ఎప్పుడు : అక్టోబర్ 9
ఎవరు : డెన్మార్క్ ప్రధాని మెటె ఫ్రెడెరిక్‌సెన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : ఆరోగ్య, వ్యవసాయ, నీటి నిర్వహణ, వాతావరణ మార్పు, పునర్వినియోగ ఇంధనాలు వంటి విషయాలపై చర్చలు జరిపేందుకు...
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్