Skip to main content

Industrial Security: రక్షణ రంగ సాంకేతికత అంశంలో ఒప్పందం చేసుకున్న దేశాలు?

అత్యాధునిక సాంకేతికతలను అందిపుచ్చుకోవడంలో భారత్‌–అమెరికాల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ రంగ కర్మాగారాలకు సంబంధించిన సమాచారం పంచుకోనున్నారు. రక్షణ రంగ కర్మాగార భద్రతపై ఉమ్మడి కార్యాచరణ బృందం ఏర్పాటు చేసేందుకు కూడా ప్రణాళిక సిద్ధమవుతోంది. అమెరికా–భారత్‌ల మధ్య ఢిల్లీ వేదికగా జరిగిన అయిదు రోజుల ఇండో–యూఎస్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అగ్రీమెంట్‌ (ఐఎస్‌ఏ) సమావేశంలో ఈ మేరకు ఒప్పందాలు జరిగాయని అక్టోబర్‌ 1న అధికారులు వెల్లడించారు.

యూకేపై ఆంక్షల విధింపు

భారత్‌కు వచ్చే బ్రిటిష్‌ ప్రయాణికులు టీకా తీసుకున్నా, తీసుకోకున్నా 10 రోజులు తప్పక క్వారంటైన్‌లో గడపాలని భారత్‌ నిర్ణయించింది. బ్రిటన్‌కు వచ్చే భారతీయులు టీకా తీసుకున్నా సరే క్వారంటైన్‌లో గడపాలన్న నిర్ణయంపై తీవ్రంగా మండిపడ్డ భారత్‌ అందుకు ప్రతిచర్యగా ఈనిర్ణయం తీసుకుంది. బ్రిటన్‌ విధించిన గడువు అక్టోబర్‌ 4నుంచే భారత్‌ ఆదేశాలు కూడా అమల్లోకి రానున్నాయి.

చ‌ద‌వండి: 157 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించిన దేశం?


క్విక్‌ రివ్యూ   :
ఏమిటి    : భారత్‌–అమెరికాల మధ్య ఒప్పందం 
ఎప్పుడు : అక్టోబర్‌ 1 
ఎక్కడ    : న్యూఢిల్లీ
ఎందుకు : రక్షణ రంగ కర్మాగారాలకు సంబంధించిన సమాచారం పంచుకోనేందుకు...

 

Published date : 02 Oct 2021 02:03PM

Photo Stories