Skip to main content

Artefacts & Antiquities: 157 పురాతన కళాఖండాలను భారత్‌కు అప్పగించిన దేశం?

PM Modi-Artefacts

భారత్‌కు చెందిన 157 పురాతన కళాఖండాలను అమెరికా ప్రభుత్వం... భారత్‌కు అప్పగించింది. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోదీకి సెప్టెంబర్‌ 25న వీటిని అందించింది. పురాతన వస్తువుల దొంగతనం, అక్రమ రవాణాను అడ్డుకొనేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని, ప్రయత్నాలను బలోపేతం చేద్దామని మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నిర్ణయించుకున్నారు.

లోహ, రాతి విగ్రహాలు...

అమెరికా అప్పటించిన కళాఖండాల్లో 71 భారత ప్రాచీన సంస్కృతికి చెందినవి కాగా, 60 హిందూమతానికి, 16 బౌద్ధమతానికి, 9 జైనమతానికి చెందినవి ఉన్నాయి. అక్రమరవాణాదారులు వీటిని గతంలో భారత్‌లో దొంగిలించి, అంతర్జాతీయ స్మగ్లర్లకు అమ్మేశారు. పలువురి చేతులు మారి చివరకు అమెరికాకు చేరుకున్నాయి. ఇందులో 10వ, 11వ శతాబ్దానికి చెందిన విలువైన లోహ, రాతి విగ్రహాలు సైతం ఉన్నాయి.

 

మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో (యూఎన్‌ఎస్‌సీ) భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ అన్నారు. ఈ అంశంలో భారత్‌కు అమెరికా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పారు. భారత్‌ను న్యూక్లియర్‌ సప్లయర్స్‌ గ్రూపులో (ఎన్‌ఎస్‌జీ)లో చేర్చాలని అన్నారు. వాషింగ్టన్‌లోని వైట్‌హౌస్‌లో అధ్యక్షుడు బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశం ముగిసిన తర్వాత ఇద్దరు నేతలు ఈ మేరకు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

చ‌ద‌వండి: నరేంద్ర మోదీ, జో బైడెన్‌ తొలిసారి ఏ నగరంలో సమావేశమయ్యారు?

 

 

 

 

Published date : 27 Sep 2021 06:03PM

Photo Stories