India-USA: నరేంద్ర మోదీ, జో బైడెన్ తొలిసారి ఏ నగరంలో సమావేశమయ్యారు?
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. అమెరికా రాజధాని నగరం వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న జరిగిన ఈ భేటీలో ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ఇండో–పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలపై చర్చలు జరిపారు. గతంలో బైడెన్ అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒకసారి మోదీతో భేటీ అయ్యారు. ఆయన అధ్యక్షుడయ్యాక పలుమార్లు ఫోన్లలో, ఆన్‌లైన్ సమావేశాల్లో సంభాషించుకున్నా, ముఖాముఖి భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రధాని పదవి స్వీకరించాక మోదీ అమెరికా సందర్శించడం ఇది ఏడవసారి.
కమలకు తాతయ్య జ్ఞాపకం
ప్రధాని మోదీ, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌కు అరుదైన జ్ఞాపకాన్ని బహుమతిగా ఇచ్చారు. కమల తాతయ్య, తమిళనాడుకు చెందిన పి.వి. గోపాలన్‌కు సంబంధించిన ఒక పాత నోటిఫికేషన్‌ను హస్తకళా నిపుణులు తయారు చేసిన కలప ఫ్రేమ్‌లో పెట్టి బహుమానంగా ఇచ్చారు.
జపాన్ ప్రధాని సుగాతో ముఖాముఖి
భారత ప్రధాని మోదీ, జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో వాషింగ్టన్‌లో సెప్టెంబర్ 24న ముఖాముఖి చర్చలు జరిపారు. అఫ్గానిస్తాన్ సంక్షోభం, ఇండో పసిఫిక్ ప్రాంతం, రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పరం సహకారం వంటి అంశాలపై వారు చర్చించారు. క్వాడ్ సదస్సులో పాల్గోనేందుకు ఇరువురు నేతలు వాషింగ్టన్ వచ్చిన విషయం తెల్సిందే.
చదవండి: భారత ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షురాలు కమల భేటీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో సమావేశం
ఎప్పుడు : సెప్టెంబర్ 24
ఎవరు : భారత ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షిక బంధాల బలోపేతం, ఇండో–పసిఫిక్, వాతావరణ మార్పు, వాణిజ్యం, కోవిడ్‌తో సహా పలు అంశాలపై చర్చలు జరిపేందుకు...