CAA New Portal: సీఏఏకు కొత్త పోర్టల్ ప్రారంభం.. దరఖాస్తు చేసుకోండిలా..
ఈ చట్టం ద్వారా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుండి 2014 డిసెంబర్ 31కి ముందు భారతదేశానికి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
దరఖాస్తు చేసుకోండిలా..
➢ ఈ చట్టం కింద దరఖాస్తుల స్వీకరణకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఒక కొత్త వెబ్ పోర్టల్ https://indiancitizenshiponline.nic.inను ప్రారంభించింది.
➢ అలాగే.. CAA-2019 పేరుతో ఒక మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది.
Citizenship Amendment Act : వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం.. అమల్లోకి సీఏఏ!!
అర్హులు వీరే..
➢ 2014 డిసెంబర్ 31కి ముందు హింసకు గురై భారతదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతర వ్యక్తులు ఈ చట్టం పరిధిలోకి వస్తారు.
➢ హిందువులు, జైనులు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్శీలకు పౌరసత్వం కల్పించనున్నారు.
➢ వారి వద్ద తగిన పత్రాలు లేకపోయినా వారికి పౌరసత్వం ఇవ్వడానికి ఈ చట్టం ఏర్పాటు చేస్తుంది.
పాత చట్టంలో మార్పులు..
➢ భారతదేశంలో 11 ఏళ్ల పాటు ఉన్న శరణార్థులకు మాత్రమే పౌరసత్వం కల్పించేలా పాత చట్టంలో ఉన్న నిబంధనను మోదీ సర్కార్ సవరించింది.
➢ ఇప్పుడు, గత 14 ఏళ్లలో కనీసం ఐదేళ్ల పాటు లేదా ఏడాది కాలంగా భారతదేశంలో నివసించిన వారికి ఈ చట్టం వర్తిస్తుంది.