Citizenship Amendment Act Rules: వివాదాస్పద చట్టంపై కేంద్రం నిర్ణయం.. అమల్లోకి సీఏఏ!!
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మార్చి 11వ తేదీ నోటిఫికేషన్ జారీ చేసింది. తద్వారా సీఏఏను అమలు చేస్తామన్న గత లోక్‌సభ ఎన్నికల హామీని బీజేపీ నిలబెట్టుకున్నట్టయింది.
సీఏఏకు నాలుగేళ్ల క్రితమే పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదముద్ర పడ్డా దేశవ్యాప్త వ్యతిరేకత, పూర్తి నిబంధనలపై సందిగ్ధత తదితరాల నేపథ్యంలో అమలు వాయిదా పడుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో చట్టం తాలూకు నియమ నిబంధనలను కేంద్రం తాజాగా విడుదల చేసింది. మతం ప్రాతిపదికగా భారత పౌరసత్వం కల్పిస్తున్న తొలి చట్టమిది! పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు ధ్రువీకరణ పత్రాలతో నిమిత్తం లేకుండా పౌరసత్వం కల్పించడం దీని ఉద్దేశం.
Vande Bharat Trains: 10 ‘వందే భారత్’ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ.. అవి తిరిగేది ఎక్కడంటే..?
సీఏఏలో ఏముంది..!
► సీఏఏ–2019 చట్టం ప్రకారం మతపరమైన ఊచకోత బాధితులైన మైనారిటీలకు భారత పౌరసత్వం కల్పిస్తారు.
► 2014 డిసెంబర్ 31కి ముందు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ నుంచి వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులు ఇందుకు అర్హులు.
► అంతకుముందు కనీసం ఏడాది నుంచి భారత్‌లో ఉంటున్నవాళ్లకు, 14 ఏళ్లలో కనీసం ఐదేళ్లు ఉన్నవాళ్లకు పౌరసత్వం కల్పిస్తారు. గతంలో 11 ఏళ్లుండగా ఐదేళ్లకు తగ్గించారు.
► ఇందుకు వీరు ఎలాంటి శరణార్థి తదితర ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సిన అవసరముండదు. ఈ మేరకు పౌరసత్వ చట్టం–1955కు మోదీ సర్కారు సవరణలు చేసింది.
► అసోం, మేఘాలయ, మిజోరం, త్రిపురల్లోని గిరిజన ప్రాంతాలను ఈ చట్టం పరిధి నుంచి మినహాయించారు.