Skip to main content

Eastern Ladakh Border: తూర్పు లద్దాఖ్‌పై భారత్, చైనా సైనిక చర్చలు!

తూర్పు లద్దాఖ్‌లో మూడున్నరేళ్ల క్రితం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను సడలించేందుకు భారత్, చైనా 21వ విడత సైనిక చర్చలు జరిపాయి.
India, China Hold Border Talks In Ladakh  Military personnel discussing border issues

చర్చల్లో ఎలాంటి కీలకమైన ఉమ్మడి నిర్ణయాలు తీసుకోలేకపోయారు. వాస్తవాదీన రేఖ వెంబడి ఛుషుల్‌–మోల్డో బోర్డర్‌ పాయింట్‌ వద్ద చైనా వైపు భూభాగంలో ఫిబ్రవరి 19వ తేదీన ఈ చర్చలు జరిగాయి. భారత్‌ తరఫున లేహ్‌ కేంద్రంగా ఉన్న 14వ కోర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ రషీమ్‌ బాలీ, చైనా తరఫున దక్షిణ గ్జిన్‌జియాంగ్‌ సైనిక జిల్లా కమాండర్‌ ఈ చర్చల్లో పాల్గొన్నారు.
 
కోర్‌ కమాండర్‌ స్థాయిలో జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాల సైనికుల మొహరింపును ఉపసంహరించుకోవడంపై ప్రధానంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న స్థాయిలోనే సైనిక, దౌత్య కమ్యూనికేషన్లను ఇకమీదట‌ కొనసాగించాలని నిర్ణయించారు. స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయని భారత విదేశాంగ శాఖ ఫిబ్రవరి 21వ తేదీ వెల్లడించింది.

దెస్పాంగ్, దెమ్‌చోక్‌ ప్రాంతాల్లో బలగాల ఉపసంహరణ అంశమూ చర్చకొచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అక్టోబర్‌లో 20వ విడత చర్చలు జరిగాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు వెంట సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయని జనవరిలో ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే వ్యాఖ్యానించారు. 2020 ప్రథమార్ధంలో తూర్పు లద్దాఖ్‌లో ఉన్న సాధారణ స్థాయికి ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించేందుకు ఇరుదేశాలు ప్రయత్నిస్తున్నాయి.

World Most Powerful Passports List: పవర్‌ఫుల్ పాస్‌పోర్టుల జాబితా విడుదల.. భారత్ ఎన్నో స‍్థానంలో ఉందంటే!!

Published date : 22 Feb 2024 01:11PM

Photo Stories