2+2 Ministerial Dialogue: భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు ఎక్కడ జరగనున్నాయి?
భారత్, అమెరికా మధ్య నాలుగో వార్షిక 2+2 చర్చలు 2021, నవంబర్ నెలలో వాషింగ్టన్ నగరంలో జరగనున్నాయి. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా సెప్టెంబర్ 4న తెలిపారు. ఈ దఫా చర్చల్లో భారత రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాధ్ సింగ్, జైశంకర్‌లు తొలిసారి బైడెన్ ప్రభుత్వంలోని రక్షణ, విదేశాంగ మంత్రులతో సమావేశం కానున్నారు.
భారత్ ఆందోళనలపై తాలిబన్లు సానుకూలం!
అఫ్గాన్ తాజా పరిణామాల నేపథ్యంలో భారత్ లేవనెత్తుతున్న ఆందోళనల పట్ల సానుకూలంగా స్పందిస్తామని తాలిబన్లు సంకేతాలిచ్చారని విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా తెలిపారు. తాలిబన్ల అధీనంలోకి వెళ్లిన అఫ్గానిస్తాన్‌లో పాక్ చర్యల్ని భారత్, అమెరికా నిశితంగా గమనిస్తున్నాయని చెప్పారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం అమెరికా వెళ్లిన ఆయన ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్‌తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2021, నవంబర్‌లో భారత్, అమెరికా మధ్య 2+2 చర్చలు
ఎప్పుడు : సెప్టెంబర్ 4
ఎవరు : భారత విదేశాంగ శాఖ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లా
ఎక్కడ : వాషింగ్టన్, అమెరికా
ఎందుకు : ద్వైపాక్షికం, రక్షణ, అంతర్జాతీయ పరిణామాలు వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...