2+2 Ministerial Dialogue: ఇండో– ఆసిస్ 2+2 చర్చలు ఎక్కడ ప్రారంభమయ్యాయి?
రెండు దేశాల విదేశాంగ, రక్షణ మంత్రిత్వ శాఖల మధ్య జరిగే చర్చలనే 2+2చర్చలు అంటారు. ఈ చర్చల్లో భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్, ఆసిస్ విదేశాంగ మంత్రి మారైజ్‌పేనీ, రక్షణమంత్రి పీటర్ డట్టన్ పాల్గొన్నారు. అఫ్గాన్ నేలను ఉగ్రచర్యలుకు వాడకుండా చూడాలని, ఆదేశాన్ని ఉగ్రవాదులకు స్వర్గంగా మార్చవద్దని ఇరుదేశాల నేతలు అభిప్రాయపడ్డారు. ఐరాస తీర్మానం 2593ను (అఫ్గన్ గడ్డను ఉగ్ర అడ్డగా మార్చకూడదు) అమలు చేయాలని అంగీకరించారు. కరోనాపై ఉమ్మడి పోరును కొనసాగించాలని నిర్ణయించారు. 2+2 చర్చలు ఫలవంతగా సాగాయని మంత్రి జైశంకర్ చెప్పారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉద్రిక్తతలు, ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరగడం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడటం వంటి అంశాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు.
చదవండి: ఎయిర్‌క్రాఫ్ట్‌ల ల్యాండింగ్ కోసం అభివృద్ధి చేసిన తొలి రహదారి?
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఇండో– ఆసిస్ 2+2 చర్చలు ప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 11
ఎవరు : భారత విదేశాంగ మంత్రి జైశంకర్, రక్షణమంత్రి రాజ్‌నాధ్ సింగ్, ఆసిస్ విదేశాంగ మంత్రి మారైజ్‌పేనీ, రక్షణమంత్రి పీటర్ డట్టన్
ఎక్కడ : న్యూఢిల్లీ
ఎందుకు : అఫ్గాన్‌లోని తాజా పరిస్థితులు, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతిని కాపాడటం వంటి అంశాలపై చర్చలు జరిపేందుకు...