Skoch Awards 2022: స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘‘వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ’’ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు లభించింది. కార్యక్రమంలో భాగంగా 30 లక్షల మందికీ ఒకేసారి పట్టాలు పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా ఆన్‌లైన్‌లో లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఇది కాకుండా మరో మూడు అవార్డులూ రాష్ట్రానికి వచ్చాయి. ‘మీ భూమి ప్రాజెక్టు’కి స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. కౌలు రైతులకు ఆన్‌లైన్‌లో కార్డులు జారీ చేసే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్‌సీ), భూసోదక్ యాప్‌కు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు వచ్చాయి. మొత్తం 9 ప్రాజెక్టులకు సీసీఎల్‌ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) స్కోచ్ అవార్డ్స్–2022కి నామినేషన్లు పంపగా వాటిలో నాలుగింటికి అవార్డులు వచ్చాయి.
Andhra Pradesh New Districts: రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎవరి పేరును పెట్టారు?
Invest India: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డుకి ఎంపికైన కార్యక్రమం?
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించిన వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పంపిణీ
ఎందుకు : లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించినందుకు..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్