Andhra Pradesh New Districts: రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎవరి పేరును పెట్టారు?
పాలన వికేంద్రీకరణలో భాగంగా సత్వర, సమగ్ర, సమాన, సర్వజన సంపూర్ణాభివృద్ధి లక్ష్యంగా ఏప్రిల్ 4న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 13 నూతన జిల్లాలను ఏర్పాటు చేసింది. దీంతో 26 జిల్లాల ఆంధ్రప్రదేశ్ సాక్షాత్కారమయ్యింది. నూతన జిల్లాల పేర్లను పరిశీలిస్తే పలు అంశాలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఆ వివరాలివీ..
ఆంధ్ర కేసరితో ఆరంభం..
- 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు, వైఎస్సార్ కడప జిల్లాలు ప్రముఖుల పేర్లతో ఉన్నాయి. జిల్లాల విభజనతో ఇది ఏడుకు పెరిగింది.
- స్వాతంత్ర సమర యోధుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలను గుర్తిస్తూ 1972లో తొలిసారిగా ఒంగోలు జిల్లా పేరును ప్రకాశం జిల్లాగా మార్చారు.
- ఆమరణ నిరాహార దీక్షతో ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించిన పొట్టి శ్రీరాములు పేరును 2008లో నెల్లూరు జిల్లాకు పెట్టారు.
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును 2010లో కడప జిల్లాకు పెట్టారు.
AP New Districts: రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన జిల్లాలు?
అల్లూరి జిల్లా..
- బ్రిటీషు వారిని ఎదిరించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో పాడేరు కేంద్రంగా తాజా గిరిజన జిల్లా ఏర్పాటైంది.
- టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు పేరుతో విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ జిల్లా ఏర్పాటైంది.
- ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా, పుట్టపర్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లాలు ఏర్పాటయ్యాయి.
ఐదు అత్యధిక వర్షపాత జిల్లాలు..
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అత్యధికంగా 1,400 మి.మీ సగటు వర్షపాతంతో అల్లూరి సీతారామరాజు జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. తర్వాత స్థానాల్లో తిరుపతి జిల్లా 1,300 మి.మీ, కోనసీమ జిల్లా 1,200 మి.మీ, పార్వతీపురం మన్యం 1150 మి.మీ, విశాఖపట్నం 1,100 మి.మీ వరకు ఉన్నట్లు అంచనా.
AP New Districts List: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల సమగ్ర స్వరూపం ఇదే.. అతి పెద్ద జిల్లాగా..
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రఖ్యాత వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమయ్య పేరుతో రాయచోటి కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఏర్పాటు
ఎప్పుడు : ఏప్రిల్ 04
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్