Invest India: ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అగ్రస్థానంలో నిలిచిన రాష్ట్రం?
విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో కీలకమైన సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో 2021 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని ఏప్రిల్ 6న ఇన్వెస్ట్ ఇండియా(నేషనల్ ఇన్వెస్ట్‌మెంట్ ప్రమోషన్ అండ్ ఫెసిలియేషన్ ఏజెన్సీ) వెల్లడించింది. ఇన్వెస్ట్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం..
- 2019 అక్టోబర్ నుంచి 2021 డిసెంబర్ వరకు ఆంధ్రప్రదేశ్‌కు 451 అమెరికన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ) వచ్చాయి.
- రాష్ట్రానికి 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండడంతోపాటు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు ఉండటం పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి.
- ఇక 2018–19 నాటికి ఆంధ్రప్రదేశ్ వృద్ధి రేటు జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా 11.02 శాతంగా నమోదైంది. పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఇది కూడా ఒక కారణం.
- ఎగుమతుల సన్నద్ధత సూచి–2021, నేషనల్ లాజిస్టిక్స్ ఇండెక్స్–2021లో ఆంధ్రప్రదేశ్ 9వ ర్యాంకును సాధించింది.
Andhra Pradesh New Districts: రాయచోటి కేంద్రంగా ఏర్పాటైన జిల్లాకు ఎవరి పేరును పెట్టారు?
AP New Districts: రాష్ట్రంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన జిల్లాలు?
క్విక్ రివ్యూ :
ఏమిటి : సులభతర వాణిజ్య విధానం(ఈవోడీబీ)లో 2021 2021 ఏడాదికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలిచింది.
ఎప్పుడు : ఏప్రిల్ 06
ఎవరు : ఇన్వెస్ట్ ఇండియా
ఎక్కడ : దేశంలో..
ఎందుకు : రాష్ట్రానికి 974 కిలోమీటర్ల మేర తీర ప్రాంతం ఉండడంతోపాటు మెరుగైన రైలు, రోడ్డు రవాణా సదుపాయాలు ఉన్నందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా..
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్