Skip to main content

SIIMA Awards 2023: సైమా ఉత్తమ నటుడుగా జూనియర్ ఎన్టీఆర్

ప్రతిష్టాత్మక సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2023 వేడుక దుబాయ్‌లో ప్రారంభం అయింది.
SIIMA Awards 2023, South Indian Cinema, BestActor, Dubai
SIIMA Awards 2023

దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన చిత్రాలు, నటులు సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించే ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు ‘సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌(సైమా). గత పదేళ్లుగా కొనసాగుతున్న ఈ అవార్డుల వేడుకగా తాజాగా 11వ వసంతంలోకి అడుగుపెట్టింది. సెప్టెంబర్‌ 15న మొదటిరోజున తెలుగు, కన్నడ సినిమాలకు సంబంధించిన అవార్డుల వేడుక పూర్తి అయింది. 

National Film Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు... పూర్తి జాబితా ఇదే

సైమాలో దుమ్ములేపిన RRR, సీతా రామం

ఆర్ఆర్ఆర్ సినిమాకు వచ్చిన రికార్డుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా బాక్సాఫీస్‌నే కాదు, రికార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పటికే జాతీయ, అంతర్జాతీయ స్టేజిల మీద ఆస్కార్‌తో సహా ఎన్నో అవార్డులను అందుకున్న ఈ సినిమా సైమాలో కూడా రికార్డులను బ్రేక్ చేసింది. ఏకంగా సైమా అవార్డుల రేసులో  11 నామినేషన్స్‌లలో చోటు దక్కించుకొని 5 కీలకమైన అవార్డులను దక్కించుకుంది. సీతా రామం చిత్రానికి గాను మూడు అవార్డులను దక్కించుకుంది. ఉత్తమ చిత్రంగా సీతా రామం నిలిచింది.

GOA INTERNATIONAL FILM FESTIVAL OF INDIA: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

సైమా విజేతలు వీళ్లే!

* ఉత్తమ చిత్రం: సీతా రామం
* ఉత్తమ దర్శకుడు: SS రాజమౌళి (RRR) 
* ఉత్తమ నటుడు: జూనియర్ ఎన్టీఆర్ (RRR) 
* ఉత్తమ నటి : శ్రీలీల (ధమాకా)

* ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): అడివి శేష్  (మేజర్)
* ఉత్తమ నటి  (క్రిటిక్స్‌): మృణాల్ ఠాకూర్ (సీతా రామం) 
* ఉత్తమ సహాయ నటుడు: రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్) 
* ఉత్తమ సహాయ నటి: సంగీత(మసూద) 
* ఉత్తమ నూతన నటి : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: MM కీరవాణి(RRR)

* ఉత్తమ గేయ రచయిత 'నాటు నాటు' పాట కోసం: చంద్రబోస్ (RRR)
* ఉత్తమ గాయకుడు : మిర్యాల రామ్ (DJ టిల్లు) టైటిల్ సాంగ్ కోసం 
* ఉత్తమ ప్లేబ్యాక్ సింగర్: సింగర్ మంగ్లీ (ధమాకా) 'జింతక్' పాట కోసం
* ఉత్తమ విలన్‌ : సుహాస్ (హిట్ - 2) 
* ఉత్తమ సినిమాటోగ్రాఫర్: సెంథిల్ కుమార్ (RRR) 

* ఉత్తమ నూతన దర్శకుడు: మల్లిడి వశిష్ట (బింబిసార) 
* సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్: నిఖిల్ సిద్ధార్థ (కార్తికేయ 2)
* ఉత్తమ హాస్యనటుడు: శ్రీనివాస రెడ్డి (కార్తికేయ 2) 
* ఉత్తమ నూతన నిర్మాతలు : శరత్, అనురాగ్ (మేజర్) 
* ఫ్లిప్‌కార్ట్‌ ఫ్యాషన్‌ యూత్‌ ఐకాన్‌: శ్రుతి హాసన్‌
* ప్రామిసింగ్ న్యూకమ్: వినోద ప్రపంచంలో భవిష్యత్‌లో మంచి స్టార్‌గా గుర్తింపు పొందిన గణేష్ బెల్లంకొండ

IndIAA Awards 2023: 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..

Published date : 16 Sep 2023 01:27PM

Photo Stories