Skip to main content

IndIAA Awards 2023: 'ఐఏఏ' అవార్డు విజేతలు వీరే..

ఇండియా చాప్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్వర్టైజింగ్ అసోసియేషన్ (IAA) తన ప్రతిష్టాత్మకమైన IndAA అవార్డుల ఎనిమిదవ ఎడిషన్‌ కార్యక్రమాన్ని 2023 సెప్టెంబర్ 1న ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు ఏబీపీ నెట్‌వర్క్ అండ్ సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ కో-పార్ట్‌నర్‌గా ఉండగా.. నెట్‌వ‌ర్క్18 & జియో  సినిమా అసోసియేట్ పార్ట్‌నర్‌గా ఉన్నాయి.
IndIAA Awards 2023
IndIAA Awards 2023

ఈ కార్యక్రమంలో 15 క్రియేటివ్ ఏజెన్సీలు 18 ప్రోడక్ట్ అండ్ సర్వీస్ కేటగిరీలు.. ఒక ప్రత్యేక కేటగిరీలో అవార్డులు పొందాయి. అవార్డులలో 102 క్యాంపెయిన్స్ షార్ట్‌లిస్ట్ చేయగా.. వీటిలో డిజైన్ ప్రకారం, ప్రతి విభాగంలో ఒకటి మాత్రమే ఇవ్వడం జరిగింది. క్లోజ్ కాంటెస్ట్ విషయంలో మాత్రం జ్యూరీ చాలా చర్చల తర్వాత ఉమ్మడి విజేతలను ప్రకటించింది. క్రియేటివ్ ఏజెన్సీలలో లియో బర్నెట్, ముల్లెన్‌లోవ్ లింటాస్ గ్రూప్, ఒగిల్వీ ఆ కేటగిరీలో ఒక్కొక్కటి మూడు IndIAA అవార్డులను గెలుచుకున్నారు. కాగా బీబీడీవో, డీడీబీ ముద్ర అండ్ టీబీడబ్ల్యుఏ రెండు అవార్డులను గెలుచుకున్నాయి.

National Film Awards 2023: 69వ జాతీయ చలనచిత్ర అవార్డులు... పూర్తి జాబితా ఇదే

గ్రే గ్రూప్, కెహత్ కబీరా పిక్చర్స్, మెక్‌కాన్ వరల్డ్‌గ్రూప్, పబ్లిసిస్ వరల్డ్‌వైడ్, రీడిఫ్యూజన్, ఎస్‌జీ మీడియా, టాలెంటెడ్, ది స్క్రిప్ట్ రూమ్, ది వోంబ్, టిల్ట్ బ్రాండ్ సొల్యూషన్స్ వంటి ఇతర క్రియేటీవ్ ఏజెన్సీలు & క్రియేటర్‌లు IndAA అవార్డును గెలుచుకున్నాయి. ఇక ఫుడ్ అండ్ బెవెరగె (పానీయాలు) & పర్సనల్ కేర్ కేటగిరి HUL బ్రాండ్‌లు విజేతలుగా నిలిచాయి. HDFC లైఫ్ ఇన్సూరెన్స్‌లో గెలుపొందగా, HDFC మ్యూచువల్ ఫండ్ బ్యాంకింగ్ & ఫైనాన్స్‌లో గెలిచింది.
ఈ సందర్భంగా జ్యూరీ ఛైర్మన్ అండ్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్, నెస్లే ఇండియా 'సురేష్ నారాయణ్' మాడ్లాడుతూ.. జ్యూరీ ఛైర్మన్‌గా నా ఐదవ సంవత్సరంలో ఇక్కడ సన్నిహితంగా పరిచయం చేసుకున్నాను. దేశంలోని గొప్ప క్రియేటివ్ మైండ్స్ కలిగిన కొందరిలో ఒకడిగా ఉన్నందుకు చాలా గౌరవంగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా 'జ్యూరీ చైర్ కా శంబోధన్' అనే పేరుతో ఒక చిన్న కవితతో అందరి నుంచి ప్రశంసలు అందుకున్నాడు.

GOA INTERNATIONAL FILM FESTIVAL OF INDIA: ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా

Published date : 05 Sep 2023 03:15PM

Photo Stories