Sahitya Akademi Awards 2023: జానికి, చదువులబాబుకు సాహిత్య అకాడమీ పురస్కారాలు
Sakshi Education
వివిధ భాషల్లోని చిరు కథలు, కవిత్వం, నాటకాలు, నవలలు, విమర్శ గ్రంథాలకు కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు-2023ను ప్రకటించింది.
ప్రముఖ విమర్శకుడు తక్కెడశిల జాని, ప్రముఖ రచయిత డీకే చదువులబాబులను కేంద్ర సాహిత్య అకాడమీ యువ, బాల పురస్కారాలు 2023 దక్కాయి. దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన బాల సాహిత్యానికి సంబంధించి 22 మందికి, యువ పురస్కారాలకు 20 మందిని ఎంపిక చేసింది.
తెలుగు భాషలో యువ పురస్కారాన్ని వైయస్సార్ జిల్లాకు చెందిన తక్కెడశిల జాని రచించిన విమర్శన గ్రంథం ‘వివేచని’, బాల పురస్కారాన్ని వైయస్సార్ జిల్లాకు చెందిన డీకే చదువుల బాబు చిరుకథల పుస్తకం ‘వజ్రాల వాన’ దక్కించుకున్నాయి.
Daily Current Affairs in Telugu: 24 జూన్ 2023 కరెంట్ అఫైర్స్...
Published date : 24 Jun 2023 04:06PM