Skip to main content

National Medals for Telugu States Police: తెలుగు రాష్ట్రాల పోలీసులకు కేంద్ర పతకాలు

ఉగ్రవాద వ్యతిరేక చర్యలు, సరిహద్దుల రక్షణ, ఆయుధాల నియంత్రణ, మాదకద్రవ్యాల నియంత్రణ వంటి నాలుగు ఆపరేషన్లలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన పోలీస్‌ అధికారులు, సిబ్బందికి కేంద్ర హోంశాఖ మెడల్స్‌ను ప్రకటించింది.
National Medals for Telugu States Police
National Medals for Telugu States Police

2023 సంవత్సరానికి తెలంగాణ నుంచి 22 మంది, ఆంధ్రప్రదేశ్‌ నుంచి 12 మందిని ఎంపిక చేసినట్లు హోంశాఖ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.

AP High Court: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ నరేందర్‌ ప్రమాణం

హోంశాఖ 2018లో ఆపరేషన్స్‌ మెడల్స్‌ను ప్రవేశపెట్టింది. తెలంగాణలో ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక నాన్‌కేడర్‌ ఎస్పీ, ఒక డీఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలు, ఐదుగురు హెడ్‌ కానిస్టేబుళ్లు, తొమ్మిదిమంది కానిస్టేబుళ్లు మొత్తం 22 మందిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసింది. ఏపీ నుంచి ఇద్దరు ఐపీఎస్‌ అధికారులు, ఒక నాన్‌కేడర్‌ ఎస్పీ, ఒక ఇన్‌స్పెక్టర్, ఒక ఎస్‌ఐ, ఒక ఆర్‌ఎస్‌ఐ, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, ముగ్గురు కానిస్టేబుళ్లు మొత్తం 12 మందిని ఎంపిక చేసింది. 

తెలంగాణ నుంచి ఎంపికైన వారు 

రాజేష్ కుమార్‌ (ఐజీపీ), నరేందర్‌ నారాయణరావు చుంగి (ఎస్పీ), ఎస్‌.చైతన్య కుమార్‌ (నాన్‌కేడర్‌ ఎస్పీ), డీఎస్పీ ఆర్‌.శ్రీనివాస్, ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రాజశేఖర్, ఎస్‌ఐలు పి.విజయభాస్కర్, ఏ.వరుణకాంత్‌ రెడ్డి, మహమూద్‌ యూసఫ్, హెడ్‌ కానిస్టేబుళ్లు టి.హరినాథ్, షేక్‌ అజారుద్దీన్, ఎం.జీ.శివమణి, ఎస్‌.ప్రసాద్, కే.సి.విజయ్‌కుమార్, పీసీలు మహమూద్‌ ఖాజా మొయిద్దీన్, మోహముంద్‌ ఇంతియాజ్, బి.సుమన్, పి.రవీందర్, ఎం.రవీదర్‌కుమార్, ఎస్‌.ప్రేమ్‌కుమార్, ఎండీ షబ్బీర్‌ పాషా, ఇంతియాజ్‌ పాషా షేక్, ఏ.శ్రీనివాస్‌. 

Additional Judges Of AP High Court: ఏపీ హైకోర్టుకు నలుగురు అదనపు న్యాయమూర్తులు

ఏపీ నుంచి ఎంపికైన వారు 

వినీత్‌ బ్రిజ్‌ లాల్‌ (ఐజీపీ), బాబూజీ అట్టాడ (ఎస్పీ), ఈజీ అశోక్‌కుమార్‌ (ఎస్పీ, నాన్‌కేడర్‌), షేక్‌ సర్దార్‌ ఘని (ఇన్‌స్పెక్టర్‌), సవ్వన అనిల్‌కుమార్‌(ఎస్‌ఐ), ఎంవీఆర్‌పీ నాయుడు (ఆర్‌ఎస్‌ఐ), రాజన్న గౌరీ శంకర్‌ (హెడ్‌కానిస్టేబుల్‌), అనంతకుమార్‌ నంద (హెడ్‌కానిస్టేబుల్‌), పీసీలు అడప మణిబాబు, వి.శ్రీను, జి.భాస్కరరావు.

Venkatagiri handlooms: వెంకటగిరి వస్త్రాలకు జాతీయ గుర్తింపు

Published date : 01 Nov 2023 12:54PM

Photo Stories