Lionel Messi: లియోనెల్ మెస్సీకి బెస్ట్ మెన్స్ ప్లేయర్ అవార్డు
పారిస్ వేదికగా ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్‌బాల్ అసోసియేషన్ నిర్వహించిన బెస్ట్ ఫిఫా ఫుట్‌బాల్ అవార్డ్స్‌లో మెస్సీ ఈ అవార్డును అందుకున్నారు. 2022 డిసెంబర్‌లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌లో మెస్సీ అద్భుత ఆటతీరుతో అర్జెంటీనాను విశ్వవిజేతగా నలిపాడు. ఈ సందర్భంగా మెస్సీ మాట్లాడుతూ ఫిఫా అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న మెస్సీ తాజాగా ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. ఈ అవార్డు కోసం మెస్సీతో పాటు ఫ్రాన్స్ ఫుట్‌బాల్ స్టార్స్ కైలియన్ ఎంబాపె, కరీమ్ బెంజెమాలు పోటీ పడ్డారు. అయితే మెస్సీని దాటి అవార్డు అందుకోవడంలో ఈ ఇద్దరు విఫలమయ్యారు. 2021 ఆగస్టు 8 నుంచి 18 డిసెంబర్ 2022 వరకు మెన్స్ ఫుట్‌బాల్‌లో ఔట్‌స్టాండింగ్ ప్రదర్శన ఇచ్చిన ఆటగాళ్ల జాబితాను ఎంపిక చేశారు.
ఈ జాబితాలో మెస్సీ 52 పాయింట్లతో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోగా.. కైలియన్ ఎంబాపె 44 పాయింట్లతో రెండో స్థానం, కరీమ్ బెంజెమా 34 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. కాగా మెస్సీ ఫిఫా మెన్స్ బెస్ట్ ప్లేయర్ అవార్డు గెలుచుకోవడం ఇది ఏడోసారి కావడం విశేషం. ఇంతకముందు వరుసగా 2009, 2010, 2011, 2012, 2015, 2019.. తాజాగా 2023లో మరోసారి అవార్డును గెలుచుకున్నాడు.
ఉత్తమ FIFA ఉమెన్స్ ప్లేయర్ విజేత: అలెక్సియా పుటెల్లాస్
ఉత్తమ FIFA పురుషుల కోచ్ విజేత: లియోనెల్ స్కలోని
ఉత్తమ FIFA మహిళా కోచ్ విజేత: సరీనా విగ్మాన్
ఉత్తమ FIFA పురుషుల గోల్ కీపర్ విజేత: ఎమిలియానో మార్టినెజ్
ఉత్తమ FIFA మహిళా గోల్ కీపర్ విజేత: మేరీ ఇయర్ప్స్
FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?