Skip to main content

FIFA World Cup: ఫుట్‌బాల్‌ ప్రపంచకప్ విజేత అర్జెంటీనా

ఖతార్‌ వేదికగా డిసెంబ‌ర్ 18న జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ ఫైనల్లో అర్జెంటీనా 4–2 (షూటౌట్‌లో) తేడాతో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఫ్రాన్స్‌ను ఓడించింది.

నిర్ణీత సమయం, అదనపు సమయం కలిపి ఇరు జట్లు 3–3తో సమంగా నిలవగా, షూటౌట్‌లో ఫలితం తేలింది. అర్జెంటీనా తరఫున కెప్టెన్‌ మెస్సీ (23వ నిమిషం, 108వ నిమిషం), మరియా (36వ నిమిషం) గోల్స్‌ చేయగా.. ఫ్రాన్స్‌ తరఫున ఎంబాపె ఒక్కడే (80వ నిమిషం, 81వ నిమిషం, 118వ నిమిషం) మూడు గోల్స్‌తో హ్యాట్రిక్‌ నమోదు చేశాడు.  

FIFA World Cup 2022 History : ఫిఫా వరల్డ్‌కప్ వెనుక ఉన్న కథ ఇదే.. ఇప్ప‌టి వ‌ర‌కు విజేతలుగా నిలిచిన జ‌ట్లు ఇవే..

వరల్డ్‌కప్‌–2022 అవార్డులు 
గోల్డెన్‌ బాల్‌ (బెస్ట్‌ ప్లేయర్‌) 
మెస్సీ (7 గోల్స్‌) 
గోల్డెన్‌ బూట్‌ (టాప్‌ స్కోరర్‌; 8 గోల్స్‌) 
ఎంబాపె  
గోల్డెన్‌ గ్లౌవ్‌ (బెస్ట్‌ గోల్‌కీపర్‌) 
మార్టినెజ్‌ (అర్జెంటీనా; 34 సార్లు గోల్స్‌ నిలువరించాడు) 
బెస్ట్‌ యంగ్‌ ప్లేయర్‌ 
ఎంజో ఫెర్నాండెజ్‌ (అర్జెంటీనా) 
మ్యాన్‌ ఆఫ్‌ ద ఫైనల్‌ 
మెస్సీ 
ఫెయిర్‌ ప్లే అవార్డు 
ఇంగ్లండ్‌  

FIFA World Cup History : ఫిఫా వరల్డ్‌కప్‌ ట్రోఫీని దేనితో.. ఎలా తయారు చేస్తారంటే..?
ప్రపంచకప్‌ విశేషాలు.. 

☛ 172 ప్రపంచకప్‌లో నమోదైన మొత్తం గోల్స్‌. ఒకే టోర్నీలో ఇవే అత్యధికం. 1998, 2014 ప్రపంచకప్‌లలో 171 గోల్స్‌ చొప్పున నమోదయ్యాయి.  
64 జరిగిన మ్యాచ్‌లు 
217 ఎల్లో కార్డులు 
3 రెడ్‌ కార్డులు 
16 టోర్నీలో అత్యధిక గోల్స్‌ చేసిన జట్టు (ఫ్రాన్స్‌) 
8 ఒకే మ్యాచ్‌లో నమోదైన అత్యధిక గోల్స్‌  (ఇంగ్లండ్‌ 6, ఇరాన్‌ 2) 
2 టోర్నీలో నమోదైన సెల్ఫ్‌ గోల్స్‌ 
2 టోర్నీలో నమోదైన ‘హ్యాట్రిక్‌’లు (ఎంబాపె, గొన్సాలో రామోస్‌) 

ఎవరికెంత వచ్చాయంటే.. 
విజేత: అర్జెంటీనా 
4 కోట్ల 20 లక్షల డాలర్లు (రూ. 347 కోట్లు) 
రన్నరప్‌: ఫ్రాన్స్‌ 
3 కోట్ల డాలర్లు (రూ. 248 కోట్లు) 
మూడో స్థానం: క్రొయేషియా 
2 కోట్ల 70 లక్షల డాలర్లు (రూ. 223 కోట్లు) 
నాలుగో స్థానం: మొరాకో 
2 కోట్ల 50 లక్షల డాలర్లు (రూ. 206 కోట్లు) 
క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (4) 
కోటీ 70 లక్షల డాలర్ల చొప్పున (రూ. 140 కోట్ల చొప్పున) 
ప్రిక్వార్టర్‌ ఫైనల్స్‌లో ఓడిన జట్లకు (8) 
కోటీ 30 లక్షల డాలర్ల చొప్పున (రూ. 107 కోట్ల చొప్పున) 
గ్రూప్‌ లీగ్‌ దశలో నిష్క్ర‌మించిన‌ జట్లకు (16) 
90 లక్షల డాలర్ల చొప్పున (రూ. 74 కోట్ల చొప్పున)  

FIFA World Cup 2022 : ఫిఫా వరల్డ్‌కప్ వ‌ల్ల‌ ఇంత భారీగా ఆదాయం వ‌స్తుందా..!

ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లోని ముఖ్య‌మైన అంశాలు..
ప్రపంచకప్‌ ఫుట్‌బాల్‌ టైటిల్‌ సాధించడం అర్జెంటీనాకిది మూడోసారి. గతంలో ఆ జట్టు 1978, 1986లలో సాధించింది.
☛ ప్రపంచకప్‌ను అత్యధిక సార్లు గెలిచిన జట్ల జాబితాలో అర్జెంటీనా మూడో స్థానానికి చేరుకుంది. బ్రెజిల్‌ (5 సార్లు) టాప్‌ ర్యాంక్‌లో, జర్మనీ (4 సార్లు), ఇటలీ (4 సార్లు) సంయుక్తంగా రెండో ర్యాంక్‌లో ఉన్నాయి.  
☛‘షూటౌట్‌’ ద్వారా ప్రపంచకప్‌ నెగ్గిన మూడో జట్టు అర్జెంటీనా. గతంలో బ్రెజిల్‌ (1994లో), ఇటలీ (2006లో) ఈ ఘనత సాధించాయి. అత్యధికంగా ఆరుసార్లు ప్రపంచకప్‌లో ‘షూటౌట్‌’లలో మ్యాచ్‌లు గెలిచిన జట్టుగా అర్జెంటీనా గుర్తింపు పొందింది. 
☛ డిఫెండింగ్‌ చాంపియన్‌ తదుపరి టోర్నీ ఫైనల్లో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో అర్జెంటీనా (1990లో), బ్రెజిల్‌ (1998లో) జట్లకు ఇలాంటి ఫలితమే ఎదురైంది. 
☛ ప్రపంచకప్‌ టోర్నీ ఫైనల్లో ‘హ్యాట్రిక్‌’ సాధించిన రెండో ప్లేయర్‌ ఎంబాపె (ఫ్రాన్స్‌). 1966 ఫైనల్లో జర్మనీపై ఇంగ్లండ్‌ ప్లేయర్‌ జెఫ్‌ హర్‌స్ట్‌ తొలిసారి ఈ ఘనత సాధించాడు. 
☛ ఒకే ప్రపంచకప్‌ టోర్నీలో గ్రూప్‌ దశ మ్యాచ్‌లో, ప్రిక్వార్టర్‌ ఫైనల్లో, క్వార్టర్‌ ఫైనల్లో, సెమీఫైనల్లో, ఫైనల్లోనూ గోల్స్‌ చేసిన ఏకైక ప్లేయర్‌ మెస్సీ. 
☛ ప్రపంచకప్‌ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌ గా మెస్సీ (26 మ్యాచ్‌లు)గుర్తింపు పొందాడు. 

Weekly Current Affairs (Sports) క్విజ్ (18-24 నవంబర్ 2022)

Published date : 19 Dec 2022 11:52AM

Photo Stories