Skip to main content

Gold Nandi Award: టీనా చౌదరికి బంగారు నంది అవార్డు

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో జీసీఎస్‌ వల్లూరి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ బంగారు నంది అవార్డు–2023 ప్రదానోత్సవం డిసెంబ‌ర్ 24(ఆదివారం)న‌ నిర్వహించారు.
Honoring Achievements in Film Industry   Gold Nandi Award to Tina Chaudhary   Nandi Award Ceremony 2023   National Golden Nandi Award

శాస్త్రీయ‌ నృత్యం విభాగంలో తెనాలికి చెందిన కూచిపూడి నర్తకి మన్నే టీనాచౌదరిని బంగారు నంది పురస్కారంతో సత్కరించారు. ఇంజినీరింగ్‌ విద్య అభ్యసిస్తున్న ఆమె, పలు నృత్య వేదికలపై రాణించటమే కాకుండా, వర్ధమాన నటిగానూ గుర్తింపు పొందారు. ‘పండుగాడి ఫొటో స్టూడియో’ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటించారు. మా–ఏపీలోనూ సభ్యురాలిగా ఉన్నారు. టీనా తల్లిదండ్రులు మన్నే సత్యనారాయణ, శివకుమారి అధ్యాపకులుగా పనిచేశారు. టీనాచౌదరికి బంగారు నంది అవార్డుపై మా–ఏపీ వ్యవస్థాపకుడు, సినీదర్శకుడు దిలీప్‌రాజా, దర్శకుడు అచ్చన శ్రీనివాస్‌యాదవ్‌, నటులు మిలటరీ ప్రసాద్‌, అమీర్‌ చౌద్రి తదితరులు అభినందనలు తెలియజేశారు.

Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్‌లాండ్‌ ‘అన్వేషణ’ అవార్డ్‌

Published date : 27 Dec 2023 10:45AM

Photo Stories