Leif Erikson Lunar Prize: ఇస్రోకు ఐస్‌లాండ్ ‘అన్వేషణ’ అవార్డ్
Sakshi Education
చంద్రుడిపై జీవం జాడ కోసం అన్వేషిస్తున్న ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు ఐస్‌ల్యాండ్‌కు చెందిన సంస్థ నుంచి అవార్డ్ దక్కింది.
చంద్రయాన్–3 మిషన్ ద్వారా చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినందుకుగాను 2023 ఏడాదికి లీఫ్ ఎరిక్‌సన్ లూనార్ ప్రైజ్‌ను ఇస్తున్నట్లు హుసావిక్ నగరంలోని ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం తెలిపింది.
క్రిస్టోఫర్ కొలంబస్ కంటే 400 సంవత్సరాల ముందే అమెరికా గడ్డపై కాలుమోపిన తొలి యూరోపియన్ లీఫ్ ఎరిక్సన్‌కు గుర్తుగా ఈ అవార్డును ఎక్స్‌ప్లోరేషన్ మ్యూజియం ఇస్తోంది. నూతన అన్వేషణలతో చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను ప్రదానంచేస్తోంది. ఇస్రో తరఫున భారత రాయబారి బి.శ్యామ్ ఈ అవార్డ్‌ను అందుకున్నారు. అవార్డ్ ఇచ్చినందుకు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ధన్యవాదాలు తెలిపారు.
French Civilian Award: ఇస్రో శాస్త్రవేత్త లలితాంబికకు ఫ్రెంచ్ పురస్కారం
Published date : 23 Dec 2023 03:10PM