Dadasaheb Phalke Award 2023 : దాదా సాహేబ్ ఫాల్కే అవార్డు విజేతలు వీరే.. మళ్లీ ఆర్‌ఆర్‌ఆర్‌కు..
![Dadasaheb Phalke Award 2023 list](/sites/default/files/images/2023/02/21/actress-award-1676964334.jpg)
పలువురు సినీ తారల సమక్షంలో ఫిబ్రవరి 20వ తేదీన (సోమవారం) రాత్రి ముంబైలో దాదా సాహేబ్ ఫాల్కే ఇంటర్నెషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. ఈ సందర్భంగా విజేతలను ప్రకటించి.. అవార్డులను ప్రదానం చేశారు.
ఉత్తమ నటుడు, నటిగా..
![Dadasaheb Phalke Award kantara](/sites/default/files/inline-images/kanthara-rishaf.jpg)
‘కాంతార’సినిమాలో నటనకు గాను కన్నడ హీరో రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్‌గా అవార్డు దక్కించుకున్నారు. ఉత్తమ చిత్రంగా ‘ది కశ్మీర్ ఫైల్స్’.. ఉత్తమ నటుడిగా రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర), ఉత్తమ నటిగా అలియా భట్(గంగూబాయి కాఠియావాడి) అవార్డులను పొందారు. ఇక 2023 సంవత్సరానికి గాను దాదా సాహెబ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డును ప్రముఖ నటి రేఖ అందుకున్నారు. టెలివిజన్ రంగంలో ఉత్తమ నటుడిగా జైన్ ఇమాన్ ఉత్తమ నటిగా తేజస్వీ ప్రకాశ్ అవార్డులు అందుకోగా.. వెబ్ సిరీస్ విభాగంలో బెస్ట్ వెబ్‌సీరీస్‌గా రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్‌నెస్, ఉత్తమ నటుడు జిమ్ సార్బ్(రాకెట్ బాయ్స్) అవార్డుల పొందారు.
➤ Padma Awards 2023 : ‘పద్మ’ అవార్డులను ప్రకటించిన కేంద్రం.. ఈ సారి తెలుగు తేజాలకు..
ఈ ఏడాది దాదా సాహేబ్ ఫాల్కే విజేతలు వీరే..
![dadasaheb phalke award 2023 telugu news](/sites/default/files/inline-images/dada.jpg)
➤ ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ : ఆర్‌ఆర్‌ఆర్
➤ ఉత్తమ చిత్రం: ది కశ్మీర్ ఫైల్స్
➤ ఉత్తమ దర్శకుడు: ఆర్. బాల్కి(చుప్: ది రివెంజ్ ఆఫ్ ఆర్టిస్ట్)
➤ ఉత్తమ నటుడు: రణ్‌బీర్ కపూర్(బ్రహ్మాస్త్ర-1)
➤ మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్: రిషబ్ శెట్టి(కాంతార)
➤ ఉత్తమ నటి: అలియా భట్(గంగూబాయి కాఠియావాడి)
➤ మోస్ట్ వర్సటైల్ యాక్టర్: అనుపమ్ ఖేర్
➤ క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ : వరుణ్ ధావన్(బేడియా)
➤ క్రిటిక్స్ ఉత్తమ నటి: విద్యాబాలన్(జల్సా)
➤ బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: సాచిత్ తాండన్)