Skip to main content

CTET Results 2022 Link : CTET 2022 ఫలితాలు విడుదల.. ఎంత‌మంది క్వాలిఫై అయ్యారంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : సెంట్రల్ టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (CTET) ఫ‌లితాలు విడుద‌ల చేశారు. ఈ ఫ‌లితాల‌ను సీబీఎస్‌ఈ మార్చి 3వ తేదీ (శుక్ర‌వారం) విడుద‌ల చేశారు.
CTET Results 2022 telugu news
CTET Results 2022

డిసెంబర్ 28వ తేదీ నుంచి ఫిబ్రవరి 7 వరకు జరిగిన పరీక్షల్లో ఈసారి పేపర్‌- 1కు 17,04,282 మంది రిజిస్టర్‌ చేసుకోగా.. 14,22,959మంది హాజరయ్యారు. వీరిలో 5,79,844మంది అర్హత సాధించినట్టు సీబీఎస్‌ఈ వెల్లడించింది. అలాగే పేపర్‌-2లో 15,39,464మంది అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 12,76,071 మంది హాజరయ్యారు. వీరిలో 3,76,025 మంది అర్హత సాధించారు. రెండు పేపర్లు కలిపి మొత్తంగా 9.5లక్షల మంది క్వాలిఫై అయ్యారు. సీటెట్‌కు 32 లక్షల మందికి పైగా ప‌రీక్ష‌ రాశారు. 

 ☛ సీటెట్‌తో ప్రయోజనాలు, పరీక్ష విధానం, విజయానికి మార్గాలు..
 
సీటెట్‌లో సాధించిన స్కోర్‌కు జీవిత కాలం వ్యాలిడిటీ ఉంటుంది. ఈ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.

☛ CTET 2022 ఫలితాల కోసం క్లిక్ చేయండి
 

Published date : 04 Mar 2023 01:56PM

Photo Stories