Nanda prusty ఇది అద్భుతం..102 ఏళ్ల టీచర్ చేసిన సేవలకు...
విద్యారంగంలో నందా చేసిన సేవలకు ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇంతకు మించిన మరో విషయం నెటిజన్లను ఆకర్షించింది. అవార్డు అందుకున్న ప్రస్తీ రాష్ట్రపతి కోవింద్‌ను నిండైన చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విటర్‌లో వేల రియాక్షన్‌లను అందుకుంటోంది.
తన గ్రామంలో నిరక్షరాస్యతను..
నందా సర్ అని కూడా పిలువబడే ప్రస్ట్రీ ఒడిశాలోని జాజ్‌పూర్‌లో పిల్లలతోపాటు పెద్దలకు ఉచిత విద్యాను అందించేందుకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే అతని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. ‘రాష్ట్రపతి కోవింద్ సాహిత్యం, విద్య కోసం చేసిన కృషికి నందా ప్రస్తీకి పద్మశ్రీని ప్రదానం చేశారు. ఒడిశాలోని జాజ్‌పూర్‌లో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలకు ఉచిత విద్యను అందించిన 102 ఏళ్ల “నందా సర్”, రాష్ట్రపతిని ఆశీర్వదిస్తున్నారు. అని భారత రాష్ట్రపతి ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది.
అద్భుతమైన..
కాగా ప్రస్తీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యపై ఆయనకున్న అంకిత భావాన్ని అభినందిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతిని ఆశీర్వదించడం ఎంతో అమూల్యం, విలువైనదని కొనియాడుతున్నారు. ‘మాటల్లో వర్ణించలేనిది. ఇది నేను కలలుగన్న భారతం. నిజమైన గురువు.. అద్భుతమైన ఫోటో. అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా నవంబర్ 8,9 తేదీల్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివిధ రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకలో ఏడు పద్మ విభూషణ్‌లు, 10 పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందించారు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకూ ఉన్నారు.