Skip to main content

Government Jobs: అదొ మారుమూల గ్రామం..అయితేనేం వంద మందికిపైగా ప్రభుత్వ ఉద్యోగులే..

వైఎస్సార్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం పెద్దబిడికి. పేరుకు జిల్లాలో మారుమూల గ్రామమైనా నేడు ఆ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
YSR Kadapa
YSR Kadapa

చిన్న గ్రామమైనా ఇక్కడి నుంచి వంద మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడ్డారు. అలాగే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లతో పాటు ఇతర రంగంలోనూ ఇక్కడి వారు ఉద్యోగాలు సాధించి, అందరి మన్ననలు పొందుతున్నారు.

చిన్న సన్న కారు గిరిజన రైతులే..కానీ
వైఎస్సార్‌ జిల్లా సంబేపల్లె మండల పరిధిలోని పెద్దబిడికి వంద సంవత్సరాల క్రితమే ఏర్పడింది. బంజారా సంస్కృతి సంప్రదాయాలకు ఆ గ్రామం మారుపేరుగా నిలిచింది. ప్రస్తుతం ఆ గ్రామంలో 640 మంది ఓటర్లు ఉండగా, 345 కుటుంబాలు, 892 జనాభా ఉన్నారు. గ్రామంలో అందరూ చిన్న సన్న కారు గిరిజన రైతులు ఉన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను కష్టపడి చదివించి ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నారు.

ఠక్కున చెప్పే సమర్థులే...
ప్రస్తుతం ఆ గ్రామం నుంచి వంద మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులుగా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరితో పాటు మరో 80 మంది వేర్వేరు ప్రాంతాల్లో ప్రైవేటు ఉద్యోగాలు చేస్తున్నారు. గ్రామానికి చెందిన కొందరు ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తూ పిల్లల చదువులకు అవసరమైన నోటు పుస్తకాలు, బట్టలు తదితర వాటిని అందిస్తూ తమ గ్రామంపై తమకున్న అభిమానాన్ని చూపిస్తున్నారు. గ్రామంలో చాలా మంది విద్యావంతులే. ఏ ప్రభుత్వ పథకం గురించి అడిగినా సరే ఠక్కున చెప్పేయగల సమర్థులే.

ఈ స్థాయికి వచ్చానంటే...వీరి  వల్లే ..: హరిజవహర్‌లాల్, దేవదాయశాఖ కమీషనర్‌

హరిజవహర్‌లాల్, దేవదాయశాఖ కమీషనర్‌


మాది పేద కుటుంబం. తల్లిదండ్రుల కృషి వల్లే తాను ఈ స్థాయికి వచ్చా. మా గ్రామంలోని పెద్దల సహకారం కూడా చాలా ఉపయోగపడింది. చిన్న సెలవు దొరికినా మా గ్రామానికి వచ్చేస్తుంటా. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కాలంతో పాటు సాగితేనేమంచి భవిష్యత్తును చేరుకుంటారు. యువతరం ఎన్నుకున్న రంగంలో నిబద్ధత కలిగి విజయాలు సాధించాలి.  గ్రామాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తా.

పేదరికాన్ని దగ్గరగా చూశా..:  బి.బాలునాయక్,సిఈ ,ఆంధ్రప్రదేశ్‌

బి.బాలునాయక్


పేదరికాన్ని దగ్గరగా చూశా. మా తల్లిదండ్రులు అనేక కష్టాలను పడి మా కుటుంబాన్ని పోషించారు. ప్రస్తుతం నేను  ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నా. మా గ్రామం అంటే నాకు ఎంతో గౌరవం. నేను ఎక్కడున్నా వీలున్నప్పుడల్లా గ్రామానికి వెళ్తుంటా. గ్రామాభివృద్ధికి పెద్దలతో చర్చిస్తుంటాం.

నన్ను చదివించడానికి..: యం.మునీంద్రనాయక్, ఎంఈఓ

యం.మునీంద్రనాయక్


మా నాన్న  ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి వచ్చా. నన్ను చదివించడానికి మా నాన్న ఎంతో శ్రమ తీసుకున్నారు.  ఏ కష్టం రాకుండా మా అమ్మా నాన్న చక్కగా చూసుకుంటున్నా.మా గ్రామం అంటే ఎంతో అభిమానం. సెలవులు మంజూరైన వెంటనే గ్రామానికి వచ్చి పేద విద్యార్థులకు తగినంత ప్రోత్సాహకం అందిస్తుంటా.

మాది నిరుపేద కుటుంబం..: యం. బాలు నాయక్, డిప్యూటీ కమీషనర్‌ ఆఫ్‌ లేబర్ డిపార్ట్‌మెంట్‌

యం. బాలునాయక్


మాది నిరుపేద కుటుంబం. చిన్నప్పటి నుంచి అనేక కష్టాలను ఎదుర్కొన్నాం. నా తల్లిదండ్రుల కష్టపడి నన్ను చదివించారు. ప్రస్తుతం నేను తిరుపతిలో లేబర్‌ డిపార్టమెంట్‌ శాఖలో డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్నా. గ్రామంలో సేవా కార్యక్రమాలను అమలు చేస్తుంటాను. యువతకు పలు రంగాలల్లో అవకాశాల గురించి అవగాహన కల్పిస్తుంటాను. గ్రామాభివృద్ధికి నా వంతు సహకరించడానికే ఎప్పుడూ సిద్ధమే.
 

గ్రామంలోని ఉద్యోగలు వివరాలు ఇలా...

ఐఏఎస్‌  1
చీప్‌ ఇంజనీర్‌   1
లేబర్ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ కమీషనర్‌ 1
దక్షిణమద్య రైల్వే ఉద్యోగులు 2
డాక్ట‌ర్లు 4
టీచ‌ర్లు 33
ఏఈ 2
పోలీసులు  8
విద్యుత్‌ శాఖ   7
ఆర్మీ ఉద్యోగులు 2
టీడీడీ ఉద్యోగులు 4
వివిధ‌ శాఖల్లోని ఉద్యోగులు 41
ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు 80
Published date : 12 Nov 2021 06:34PM

Photo Stories