గ్రూప్-1 మెయిన్ రీ ఎగ్జామ్.. విజేతల సలహాలు
Sakshi Education
రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్-1 (2011) మెయిన్ రీ ఎగ్జామినేషన్‌కు రంగం సిద్ధమైంది. రెండు రాష్ట్రాల సర్వీస్ కమిషన్లు పరీక్షల షెడ్యూల్ విడుదల చేశాయి. ఈ నేపథ్యంలోఅభ్యర్థుల విజయానికి గత విజేతల సలహాలు, సూచనలు..
టీఎస్‌పీఎస్‌సీ మార్పులు..
గ్రూప్-1 (2011) పరీక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కాబట్టి.. అప్పటి సిలబస్ ప్రకారమే రీ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవచ్చని కోర్టు పేర్కొంది. అయితే వర్తమాన అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ముఖ్యంగా పేపర్-1 (జనరల్ ఎస్సే)లోని సెక్షన్-3 (ప్రస్తుతం కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ఆంధ్రప్రదేశ్)లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రస్తుతం పేపర్-3 (ఎకానమీ)లోని సెక్షన్-2 (స్వాతంత్య్రం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, సామాజిక మార్పులు), సెక్షన్-3 (ఏపీ ఎకానమీ)ల్లో సైతం తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల పేపర్-1 సెక్షన్- 3కి సంబంధించి అభ్యర్థులు సమకాలీనంగా తెలంగాణ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కాలంలో రూపొందిన కొత్త పథకాలు, ఇతర కార్యక్రమాలు, బడ్జెట్; సామాజిక, ఆర్థిక సర్వే తదితరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పేపర్-3లోని సెక్షన్-2, 3లకు సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక వనరులు, పంటలు, భూ సంస్కరణలు, భూదానోద్యమం, ముఖ్యమైన వనరులు, జనాభా, అక్షరాస్యత రేటు, ఆర్థిక సర్వే వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇలా ఒకవైపు పాత సిలబస్‌ను చదువుతూనే.. తాజాగా పేర్కొన్న నిర్ణయానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి.
గ్రూప్-1 (2011) మెయిన్ ఎగ్జామినేషన్ సమాచారం
టైం మేనేజ్‌మెంట్ ప్రధానం ప్రస్తుతం గ్రూప్-1 మెయిన్ ఎగ్జామినేషన్‌కు సిద్ధమవుతున్న అభ్యర్థులు ప్రధానంగా పాటించాల్సింది టైం మేనేజ్‌మెంట్. సిలబస్‌లో తమకు పట్టున్న, గుర్తున్న, క్లిష్టంగా భావించే అంశాలను విభజించుకొని వాటి ప్రాధాన్యం మేరకు ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. అలాగే ప్రశ్నలకు ముఖ్యమైన అంశాలతో సూటిగా, స్పష్టంగా, సరళంగా సమాధానం ఇచ్చేలా ప్రిపరేషన్ సమయంలోనే ప్రాక్టీస్ చేయాలి. పాయింట్ల వారీగా సమాధానం ఇవ్వడం కొంతవరకు మేలు చేస్తుంది. జనరల్ ఎస్సే పరంగా అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ముఖ్యంగా గత ఆరు నెలల కాలంలోని అంశాలపై పట్టు సాధించాలి. బడ్జెట్, ఐటీ పాలసీ, కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వ పథకాల గురించి ప్రత్యేక దృష్టితో చదివితే జనరల్ ఎస్సేలో ముందంజలో ఉండొచ్చు. కోర్ సిలబస్ పరంగా కొత్త పుస్తకాలు చదవాలనో? లేదా కొత్త అంశాలు నేర్చుకోవాలనే ఆలోచనకు స్వస్తి పలకాలి. అభ్యర్థులు ప్రతిరోజూ ప్రతి సబ్జెక్ట్‌ను చదివేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. సీహెచ్.ప్రియాంక, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, ఉట్నూరు |
రీడింగ్ విత్ రైటింగ్ అప్రోచ్‌తో.. గ్రూప్-1 మెయిన్‌లో విజయానికి అభ్యర్థులకు ప్రధానంగా కలిసొచ్చే అంశం.. రీడింగ్ విత్ రైటింగ్ అప్రోచ్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడే అందులోని ముఖ్యాంశాలను షార్ట్ నోట్స్‌గా రూపొందించుకోవాలి. ప్రస్తుతం అభ్యర్థులకు అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే.. ఇది కొంత క్లిష్టమైన ప్రక్రియే. కానీ పేపర్లు, సెక్షన్ల వారీగా నిర్దిష్టంగా టైం ప్లాన్ రూపొందించుకుంటే సులువుగానే సంసిద్ధత సాధించొచ్చు. మొత్తం అయిదు పేపర్లు, ఒక్కో పేపర్‌కు మూడు సెక్షన్ల చొప్పున 15 సెక్షన్లుంటాయి. వీటిని అభ్యర్థులు పరిశీలించి పట్టున్న, పట్టులేని అంశాలను వేర్వేరుగా విభజించుకోవాలి. దానికి అనుగుణంగా ఆయా అంశాల ప్రిపరేషన్‌కు సమయం కేటాయించాలి. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌కు ప్రాధాన్యం ఇవ్వడం అత్యంత అవసరం. సబ్జెక్ట్‌లను కరెంట్ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదివితే దాదాపు అన్ని పేపర్లకు ఉపయుక్తంగా ఉంటుంది. నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు పేపర్-5 కోసం కొంత ప్రత్యేక సమయం కేటాయించడం మంచిది. అన్నింటికంటే ముఖ్యంగా అభ్యర్థులు మానసిక సంసిద్ధత, ఆత్మవిశ్వాసం పెంపొందించుకోవాలి. తక్కువ సమయంలో ఎక్కువ విషయ పరిజ్ఞానం అందించే పుస్తకాలను ఎంపిక చేసుకుని చదివితే.. విజయావకాశాలు మెరుగవుతాయి. కొల్లు సురేశ్, డీఎస్పీ, ఖమ్మం |
మూస ధోరణిలో కాకుండా.. మెయిన్ ఎగ్జామ్ రాసేందుకు కొత్తగా 196 మందికి అర్హత లభించింది. వీరు ముందుగా గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. తద్వారా ఏయే అంశాలకు ఎంత వెయిటేజీ లభిస్తుందో ఒక అంచనాకు రావాలి. దాని ఆధారంగా తాము ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అంశాలకు కొంత ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. గ్రూప్-1 మెయిన్ పరీక్ష విజయంలో కీలకంగా నిలిచే పేపర్.. పేపర్-1 (జనరల్ ఎస్సే). దీనికోసం చదివేటప్పుడు మూస ధోరణిలో కాకుండా.. ఆ ఎస్సేలోని ప్రధానాంశాలను, ప్రాధాన్యతను మరొకరితో చర్చిస్తున్న తరహాలో చదివితే అధిక శాతం అంశాలు మెదడులో నిక్షిప్తం అవుతాయి. ఇంకా లోతుగా విశ్లేషించాలంటే.. సంబంధిత అంశంపై ఇంటర్వ్యూ బోర్డ్ మెంబర్‌తో చర్చిస్తున్న విధంగా స్వీయ ఆలోచన దృక్పథం అలవర్చుకోవాలి. ఇంతకుముందే (2011లోనే) పరీక్షకు అర్హత సాధించి మళ్లీ హాజరవుతున్న అభ్యర్థులు ప్రస్తుతమున్న సమయంలో స్వాట్ అనాలిసిస్ చేసుకొని అంశాలను విభజించుకోవాలి. బలహీనంగా ఉన్న అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ముందుకు సాగాలి. జనరల్ ఎస్సే మినహా మిగతా పేపర్ల విషయంలో పరీక్ష సమయంలో ఒక ప్రశ్నకు లభించే సమయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. దీనికనుగుణంగా ప్రిపరేషన్‌లోనే నిర్దేశిత సమయంలో సమాధానాలు రాసేలా ప్రాక్టీస్ చేయాలి. పి.రామచంద్రరావు, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ |
ప్రతి రోజూ పునశ్చరణ.. గ్రూప్-1 (2011) మెయిన్ రీ ఎగ్జామ్ అభ్యర్థులు ప్రతి రోజూ పునశ్చరణ (రివిజన్) విధానాన్ని పాటించడం ఎంతో అవసరం. అందుబాటులో ఉన్న సమయం కేవలం నెల రోజులే. అందువల్ల ఒకవైపు కోర్ అంశాలను చదువుతూనే వాటిని నిరంతరం పునశ్చరణ చేసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌కు సముచిత ప్రాధాన్యం లభించేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. వీలైతే వారంలో ఒక రోజు అన్ని పేపర్లకు సంబంధించి సెల్ఫ్ టెస్ట్ రాసుకుని.. దాన్ని మెటీరియల్‌లోని అంశాలతో బేరీజు వేసుకోవాలి. ప్రస్తుత సమయంలో విజయం పరంగా కలిసొచ్చే మరో ప్రధాన వ్యూహం.. గ్రూప్ డిస్కషన్స్. రోజూ కొంత సమయం సహచరులతో ఆయా అంశాలను చర్చించాలి. ఈ విధంగా గ్రూప్ డిస్కషన్ తరహా ప్రిపరేషన్ పద్ధతిని అనుసరించాలి. దీని ద్వారా కొత్త అంశాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. సబ్జెక్ట్ ప్రిపరేషన్ పరంగా రెండు, మూడు పుస్తకాలకు బదులు ఏదైనా ఒక స్టాండర్డ్ మెటీరియల్‌ను ఎంపిక చేసుకుని చదవడం మంచిది. సీహెచ్. శిరీష, డీఎస్పీ, హైదరాబాద్ |
టీఎస్‌పీఎస్‌సీ మార్పులు..
గ్రూప్-1 (2011) పరీక్ష ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది కాబట్టి.. అప్పటి సిలబస్ ప్రకారమే రీ ఎగ్జామినేషన్ నిర్వహించుకోవచ్చని కోర్టు పేర్కొంది. అయితే వర్తమాన అంశాలకు సంబంధించి తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని తాజాగా టీఎస్‌పీఎస్‌సీ ప్రకటించింది. ముఖ్యంగా పేపర్-1 (జనరల్ ఎస్సే)లోని సెక్షన్-3 (ప్రస్తుతం కరెంట్ ఈవెంట్స్ రిలేటింగ్ టు ఆంధ్రప్రదేశ్)లో తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. అదేవిధంగా ప్రస్తుతం పేపర్-3 (ఎకానమీ)లోని సెక్షన్-2 (స్వాతంత్య్రం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో భూ సంస్కరణలు, సామాజిక మార్పులు), సెక్షన్-3 (ఏపీ ఎకానమీ)ల్లో సైతం తెలంగాణ ప్రాంత అంశాలకు ప్రాధాన్యమిస్తున్నట్లు పేర్కొంది. అందువల్ల పేపర్-1 సెక్షన్- 3కి సంబంధించి అభ్యర్థులు సమకాలీనంగా తెలంగాణ ప్రాధాన్య అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత కాలంలో రూపొందిన కొత్త పథకాలు, ఇతర కార్యక్రమాలు, బడ్జెట్; సామాజిక, ఆర్థిక సర్వే తదితరాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. పేపర్-3లోని సెక్షన్-2, 3లకు సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ, పరిస్థితులకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ ప్రాంతంలో ముఖ్యమైన ఆర్థిక వనరులు, పంటలు, భూ సంస్కరణలు, భూదానోద్యమం, ముఖ్యమైన వనరులు, జనాభా, అక్షరాస్యత రేటు, ఆర్థిక సర్వే వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఇలా ఒకవైపు పాత సిలబస్‌ను చదువుతూనే.. తాజాగా పేర్కొన్న నిర్ణయానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి.
గ్రూప్-1 (2011) మెయిన్ ఎగ్జామినేషన్ సమాచారం
- మొత్తం అర్హత సాధించినవారు: 8760
- గతంలో అర్హత పొందినవారు: 8564
- కొత్తగా అర్హత సాధించినవారు: 196
Published date : 11 Aug 2016 02:13PM