నారాయణపేట రూరల్: జిల్లాలోనే తొలి సారిగా ఆర్మీకి ఓ యువతి ఎంపికై ంది. వివరాల్లోకి వెళ్తే.. పట్టణంలోని బహార్‌పేటకు చెందిన మల్లమ్మ, బాలప్ప దంపతుల మూడవ కుమార్తె అంజలి.
అంజలి
చిన్నతనం నుంచి దేశ సేవలో భాగస్వామి కావాలని కలలుకంది. అందుకు అనుగుణంగా తన విద్యాభ్యాసం కొనసాగిస్తూనే లక్ష్యంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో వారియర్స్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొంది బీఎస్‌ఎఫ్‌లో స్థానం సంపాదించుకుంది. అనుకున్న లక్ష్యం నెరవేరడంతో ఆమె ఎంతో సంతోషం వ్యక్తం చేయడంతో పాటు తన విజయానికి తల్లిదండ్రులు ఎంతో ప్రోత్సహించారని, వారి సహకారంతో కల నిజం చేసుకున్నానని చెప్పుకొచ్చింది. జిల్లా నుంచి ఆర్మీలోకి వెళ్తున్న తొలి మహిళ కావడంతో పట్టణవాసులు అభినందనలు తెలియచేస్తున్నారు. చదవండి: