Skip to main content

Trending Jobs : యూనికార్న్‌ల నుంచి 1,25,000 ఉద్యోగాలు..అర్హతలు ఇవే..

న్యూఢిల్లీ: పెద్ద ఎత్తున నిధుల సమీకరణతో స్టార్టప్‌ల నుంచి యూనికార్న్‌ల స్థాయికి వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీలు.. అదే స్థాయిలో సిబ్బందిని కూడా పెంచుకోవడంపై దృష్టి సారిస్తున్నాయి.
Latest Jobs In India
Latest Jobs

దేశంలో 70 యూనికార్న్‌లు (బిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువ), స్టార్టప్‌లు బిలియన్‌ డాలర్లు, అంతకంటే ఎక్కువ విలువ కలిగి ఉంటాయని అంచనా. వీటి నుంచి రానున్న రెండు మూడు త్రైమాసికాల్లో 1,25,000–1,60,000 వైట్‌ కాలర్‌ (శారీరక శ్రమ అంతగా అవసరం లేని) ఉద్యోగాలు రానున్నట్టు ఈఎంఏ పార్ట్‌నర్స్, సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సరీ్వసెస్‌ నిర్వహించిన రెండు వేర్వేరు సర్వేల్లో వెల్లడైంది. క్రెడిట్, మీషో, వేదాంతు, బ్రౌజర్‌స్టాక్‌ తదితర యూనికార్న్‌లు నిపుణులను మరింత పెంచుకోనున్నాయి. గడిచిన మూడు త్రైమాసికాల్లో యూనికార్న్‌లు 1,50,000 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకున్నట్టు ఈ ఏడాది సెపె్టంబర్‌లో ఈఎంఏ నిర్వహించిన సర్వేలో తెలిసింది. వచ్చే రెండు క్వార్టర్లలో మరో 1,25,000 మందిని ఇవి నియమించుకోనున్నట్టు సర్వేలో భాగంగా కంపెనీలు చెప్పాయి.  

ఈ ఉద్యోగాలే ఎక్కువగా..

New Jobs


ఇలా కొత్తగా రానున్న ఉపాధిలో ఎక్కువ భాగం (70 శాతం వరకు) టెక్నాలజీ ఉద్యోగాలే ఉండనున్నాయి. ఫుల్‌స్టాక్‌ డెవలపర్‌లు, డేటా సైంటిస్ట్‌లు, సొల్యూషన్‌ ఆర్కిటెక్ట్‌లు, ప్రిన్సిపల్‌ ఇంజనీర్లు తదితర నిపుణులకు ఉపాధి అవకాశాలు రానున్నాయి. ‘‘కేవలం వైట్‌ కాలర్‌ ఉద్యోగాల వివరాలే ఇవి. బ్లూ/గ్రే కాలర్‌ ఉద్యోగ వివరాలను ఇందులో కలపలేదు. అంతేకాదు త్వరలోనే మరిన్ని యూనికార్న్‌లు అవతరించనున్నాయి. అవి కూడా పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకోనున్నాయి. ఆ వివరాలను ఈ సర్వేలో భాగంగా తీసుకోలేదు’’ అని ఈఎంఏ పార్ట్‌నర్స్‌ సీఈవో (న్యూ బిజినెస్‌ ఇనీషియేటివ్స్‌) ఎ.రామచంద్రన్‌ పేర్కొన్నారు. సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సరీసెస్‌ నిర్వహించిన మరొక సర్వేలో.. ఈ ఏడాది యూనికార్న్‌లు ఇప్పటి వరకు చేపట్టిన నియామకాల్లో 53 శాతం మేర ఫిన్‌టెక్, టెక్‌ ప్లాట్‌ఫామ్‌లు, సాఫ్ట్‌వేర్‌ యాజ్‌ ఏ సరీ్వస్‌  (సాస్‌) విభాగాల్లోనే ఉన్నాయి. ‘‘43 శాతం యూనికార్న్‌లు పెద్ద ఎత్తున నియామకాల బాటలో నడుస్తున్నాయి. 2021 జూలై నుంచి వచ్చే 12 నెలల కాలంలో సుమారు 1,60,000 మందిని కొత్తగా నియమించుకోవాలన్నది వాటి ఉద్దేశ్యం’’ అని సీఐఈఎల్‌ హెచ్‌ఆర్‌ సర్వీసెస్‌ సీఈవో ఆదిత్య మిశ్రా తెలిపారు. కరోనా మహమ్మారి ప్రవేశించిన నాటి నుంచి యూనికార్న్‌ ‘క్రెడ్‌’ 350 మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకుంది. దీంతో సంస్థ మొత్తం ఉద్యోగుల సంఖ్య 500 దాటింది. ‘‘ప్రస్తుత సేవలను విస్తరించడం, నూతన ఉత్పత్తులను తీసుకురావడంపైనే మా దృష్టంతా ఉంది. దీంతో టెక్నాలజీ, నిర్వహణ సహా అన్ని విభాగాల్లోనూ మా సిబ్బందిని పెంచుకోవాలని అనుకుంటున్నాం’’ అని క్రెడ్‌ టాలెంట్‌ అండ్‌ కల్చర్‌ హెడ్‌ అమన్‌ప్రీత్‌ కౌర్‌ తెలిపారు.  

నిపుణల వేట ఇలా..
➤ 2021 అక్టోబర్‌ నాటికి యూనికార్న్‌లసంఖ్య: 33 
➤ బిలియన్‌ డాలర్లు అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్‌లు: 70 
➤ ఈ ఏడాది జనవరి–సెప్టెంబ‌ర్‌ మధ్య యూనికార్న్‌ల్లోకి 25 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు 
➤ నిధుల మద్దతుతో వృద్ధి సాధనకు వీలుగా నిపుణుల నియామకం 
➤ కొత్త మార్కెట్లోకి విస్తరణ, కొత్త కస్టమర్లను సొంతం చేసుకునే వ్యూహాలు 
➤ టెక్నాలజీలోనే ఎక్కువ ఉద్యోగాలు

Published date : 04 Dec 2021 03:30PM

Photo Stories