Job Layoffs : డేటా అనలిటిక్స్ ప్లాట్‌ఫారమ్ సుమోలాజిక్‌లో ఉద్యోగుల తొలగింపు.. ఎందుకంటే..?
అమెరికాలోని ప్రముఖ సంస్థ బిగ్ డేటా అనలిటిక్స్ సాఫ్ట్‌వేర్ కంపెనీ సుమో లాజిక్ 79 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది.సుమో లాజిక్ లో మొత్తం 983 మంది ఉద్యోగాలు పని చేస్తున్నారు .సుమో లాజిక్ తమ వినియోగదారుల డాటాను కాపాడే డిజిటల్ కార్యకలాపాలు సాగించే సంస్థ. ఈ కంపెనీని 2010 లో మొదలు పెట్టారు.ఇటీవలే సుమో లాజిక్ సంస్ధను ఫ్రాన్సిస్కో పార్ట్‌నర్స్ కంపెనీ 1.7 బిలియన్ల డాలర్లకు కొనుగోలు చేసింది. కొనుగోలు చేసిన నెలలోనే ఉద్యోగుల తొలగంపులు జరిగాయి.
ఫ్రాన్సిస్కో పార్ట్‌నర్స్ కంపెనీ సాంకేతిక వ్యాపారాలలో భాగస్వామ్యం చేయడంలో ప్రత్యేకత కలిగిన ప్రముఖ ప్రపంచ పెట్టుబడి సంస్థ. ప్రారంభించినప్పటి నుండి, ఫ్రాన్సిస్కో పార్ట్‌నర్స్ ప్రపంచవ్యాప్తంగా 400 కంటే ఎక్కువ టెక్నాలజీ కంపెనీలలో పెట్టుబడి పెట్టారు. ఫ్రాన్సిస్కో పార్ట్‌నర్స్ ప్రపంచవ్యాప్తంగా తన వ్యాపారాన్ని పెంచుకోవడానికి చర్యలు తీసుకుంటున్నారు.
సుమో లాజిక్ సంస్ధకు కొత్త సిఇఒగా జో కిమ్ నియమించబడ్డాడు. జో కిమ్ సుమో లాజిక్ సిబ్బందికి ఇమెయిల్ ద్వారా ఉద్యోగాల కోతలను ప్రకటించారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి మీరు ఉద్యోగం కోల్పోయారని తెలియ జేసే ఇ–మెయిల్ వస్తుందని, ఉద్యోగాలు సురక్షితంగా ఉన్న వారికి మీ ఉద్యోగం సురక్షితంగా ఉంది అని తెలియ జేసే ఇ–మెయిల్ వస్తుందని జో కిమ్ ఉద్యోగులకు తెలిపారు.
తొలగించిన ఉద్యోగులకు ‘రెండు నెలల వేతనం మాత్రమే ఇచ్చారని మరి ఏ ఇతర ప్రయోజనాలు ఇవ్వలేదని ఉద్యోగులు ఒక అన్‌లైన్ సైట్‌లో తెలిపారు.
కంపెనీల ఒప్పందం నిబంధనల ప్రకారం, సుమో లాజిక్ స్టాక్‌హోల్డర్లు ఒక్కో షేరుకు 12.05 డాలర్లు నగదు రూపంలో అందుకున్నారు.
చదవండి : IT Jobs Problems : 1000 ఉద్యోగాలకు ప్రయత్నించా.. కనీసం ఒక్క ఉద్యోగం కూడా దొరకలేదు.. చివరికి..