Layoffs Crisis: ఒక్క మే నెలలోనే అమెరికాలో 85 వేల మంది ఉద్యోగాల ఊస్టింగ్... ఇండియాలో పరిస్థితి ఏంటంటే...
గత మే నెలలో 80 వేల మంది ఉద్యోగులను తొలగించాయి అమెరికా కంపెనీలు. అది కూడా అమెరికాలో పని చేస్తున్న వారినే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను అమలు చేయటం ద్వారా.. మరో 3 వేల 900 మంది ఐటీ ఎంప్లాయిస్ తమ ఉద్యోగాలను కోల్పోయారు. ఓవరాల్ గా మే నెలలో.. అమెరికాలో 85 వేల మంది నిరుద్యోగులయ్యారు.
TCS work from home: టీసీఎస్‌ను వీడుతున్న ఉద్యోగులు... కారణం ఏంటంటే
2023 జనవరి నుంచి మే వరకు.. అమెరికాలోని అన్ని కంపెనీలు 4 లక్షల 17 వేల ఉద్యోగాలను తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అయితే గతేడాది 2022లో లక్ష మంది ఉద్యోగాలు ఊడాయి. గతేడాది కోతల కంటే ఇది 315% అధికం. ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించిన పలు కంపెనీలు.. ఉద్యోగ నియామకాలకు సైతం నిలిపివేస్తున్నాయి.
చదవండి: ఐటీ బుడగ పేలనుందా... సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి.?
ఇక ఇండియాలో....
అమెరికా తుమ్మితే ప్రపంచానికి జలుబు చేస్తుంది అన్న సామెత ఇప్పటికీ నిజమనే అనిపిస్తోంది. భారత ఐటీ పరిశ్రమ అధికశాతం అమెరికా మీదే ఆధారపడి పనిచేస్తోంది. గత ఏడాదిగా భారత ఐటీ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. కొత్త నియామకాలను నిలిపివేశాయి. ఈ మే నెలలో నియామకాలు క్రితం ఏడాది ఇదే నెలలోని గణాంకాలతో పోల్చినప్పుడు 7 శాతం తగ్గాయి.
చదవండి: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంపై ఆందోళన వద్దు... ఇలా చేస్తే మీ ఉద్యోగం గ్యారంటీ
ఆర్థిక మందగమనం పరిస్థితుల నేపథ్యంలో కంపెనీలు వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాయి. ఫౌండిట్ (మాన్‌స్టర్ ఏపీఏసీ అండ్ ఎంఈ) ‘ఫౌండిట్ ఇన్‌సైట్స్ ట్రాకర్’ పేరుతో నెలవారీ నియామకాల ధోరణులపై నివేదికను విడుదల చేసింది.
అహ్మదాబాద్, జైపూర్ వంటి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో మాత్రం నియామకాల పరంగా సానుకూల ధోరణులు కనిపిస్తున్నట్లు ఈ నివేదిక తెలిపింది. దాదాపు అన్ని రంగాల్లో నియామకాల క్షీణత కనిపిస్తోందని, నెలవారీగా చూస్తే మేలో 4 శాతం తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.