Skip to main content

జూమ్ కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగింపు..కార‌ణం ఇదే..

అమెరికాకు చెందిన ఒక కంపెనీ ఉద్యోగులకు జూమ్ వీడియో కాల్‌లో అనుకోని పరిణామం ఎదురయ్యింది.
Jobs Removed
Jobs Removed

బెట్టర్ కంపెనీ వ్యవస్థాపకుడు, సీఈఓ విశాల్ గార్గ్ ఉద్యోగులతో మాట్లాడుతూ ఒక షాకింగ్ న్యూస్ తెలిపాడు. అమెరికాలో అన్నీ కంపెనీలు క్రిస్మస్ పండుగ సీజన్ ముందు అందరికీ సెలవులు ఇస్తుంటే, బెట్టర్ కంపెనీ సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్‌లో 900 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు పేర్కొన్నాడు. జూమ్ కాల్‌లో కంపెనీ సీఈఓ చెప్పిన మాటలు వీని ఉద్యోగులు షాక్‌కు గురి అయ్యారు. 

చివరిసారి..
బెట్టర్(Better.com) కంపెనీ సీఈఓ విశాల్ గార్గ్ జూమ్ వీడియో కాల్‌లో ఉద్యోగులతో మాట్లాడుతూ.. ఈ రోజు గొప్ప వార్తలు లేవు. ప్రస్తుతం ప్రపంచంలో మార్కెట్ మారింది, కంపెనీలు దానికి అనుగుణంగా పని చేయాల్సిన అవసరం ఏర్పడింది అని తన ప్రసంగాన్ని ప్రారంభించాడు. "ఇది మీరు వినాలనుకుంటున్న మంచి వార్త కాదు, కానీ ఇది నా నిర్ణయం, మీరు నేను చెప్పేది వినాలని కోరుకుంటున్నాను. ఇది నిజంగా సవాలుతో కూడుకున్న నిర్ణయం. నా కెరీర్ లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇది రెండోసారి. చివరిసారి నేను ఈ పని చేసినప్పుడు, నేను ఏడ్చాను. ప్రస్తుతం అనేక కారణాల వల్ల మేము కంపెనీలో15 శాతం ఉద్యోగులను తొలిగించాల్సి వస్తుంది. మీరు ఆ జాబితాలో ఉంటే చాలా దురదృష్టవంతులు. ఈ నిర్ణయం అన్నీ స్థాయిలలోని ఉద్యోగులకు వర్తిస్తుంది. అలాగే, ఈ నిర్ణయం వెంటనే అమలులోకి వస్తుంది" అని జూమ్ వీడియో కాల్‌లో అన్నారు.
 

Published date : 06 Dec 2021 07:30PM

Photo Stories