Skip to main content

Job Mela : టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతోనే ఉద్యోగాలు.. పూర్తి వివ‌రాలు ఇలా..

అనంతపురం అర్బన్‌: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, సీడాప్‌ ఆధ్వర్యంలో ఫిబ్ర‌వ‌రి 11వ తేదీన‌ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డీఆర్‌డీఏ– వైఎస్సార్‌ క్రాంతి పథకం పీడీ ఐ.నరసింహారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
job mela
job mela

అనంతపురం ఆర్ట్స్‌ కళాశాలలో 11వ తేదీ ఉదయం10 గంటలకు ఇంటర్వ్యూలు ప్రారంభమవుతాయన్నారు. ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్, ధన్వి లోన్స్, సర్వీసెస్, వికాస్‌ ప్లేస్‌మెంట్‌ (కియా అనుబంధ సంస్థ), సిల్వర్‌ పార్క్‌ తదితర కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. వివరాలకు 8985091256 నంబర్‌ సంప్రదించాలన్నారు.

అర్హత... వేతనం ఇలా.. 
☛➤ ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ : సేల్స్‌ ఆఫీసర్, డెవలప్‌మెంట్‌ మేనేజర్, ఏదైనా డిగ్రీ, మార్కెటింగ్‌ రంగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి (స్త్రీ, పురుషులు), వయసు 25 ఏళ్ల నుంచి 38 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.18 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటుంది.  జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. 
☛➤ ధన్వి లోన్స్, సర్వీసెస్‌: కలెక్షన్‌ ఆఫీసర్, ఇంటర్‌ (పురుషులు), వయసు 19 ఏళ్ల నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలి. వేతనం రూ.16 వేల నుంచి రూ.17,200 వరకు ఉంటుంది. రవాణా భత్యం ఇస్తారు. జిల్లాలోనే పనిచేయాల్సి ఉంటుంది. 
☛➤ వికాస్‌ ప్లేస్‌మెంట్‌ (కియా అనుబంధ సంస్థ): మెషిన్‌ ఆపరేటర్, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, డిగ్రీ (పురుషులు), వయసు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్లలోపు ఉండాలి. వేతనం రూ.11 వేల నుంచి రూ.13 వేల వరకు ఉంటుంది. ఉచిత భోజనం, రవాణా సౌకర్యం కల్పిస్తారు. పెనుకొండ వద్ద ఉన్న సంస్థలో పనిచేయాలి. 
☛➤ సిల్వర్‌ పార్క్‌ (రేమాండ్‌): టైలర్, క్వాలిటీ ప్యాకింగ్, కటింగ్‌. పదో తరగతి ఆపై చదివిన స్త్రీలు అర్హులు. వయసు 20 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి. వేతనం రూ.13,340, ఉచిత వసతి, రాయితీతో కూడిన భోజన వసతి కల్పిస్తారు. బెంగుళూరులో పనిచేయాల్సి ఉంటుంది.

Published date : 10 Feb 2022 07:12PM

Photo Stories