Skip to main content

IT Jobs 2023 : షాక్‌లో ఉన్న‌ ఐటీ ఉద్యోగి.. ఎందుకంటే..?

ప్ర‌స్తుతం ఐటీ ఉద్యోగుల‌తో పాటు.. ఇత‌ర రంగాల్లో ప‌నిచేసే ఉద్యోగులు ప్ర‌తిరోజు ఏ టైమ్‌లో ఎలాంటి వార్త వినాల్సి వ‌స్తుందో అని భ‌యంతో ఉన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌తో వేలాది ఉద్యోగాలు ఎప్పుడు ఉంటాయో.. ఎప్పుడు పోతాయో అని అయోమ‌యంలో ఉన్నారు.
it jobs 2023 crisis news telugu

ప్ర‌స్తుతం మీరు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత రెజ్యూమ్‌లు తయారు చేస్తున్నారా..? వాటి సాయంతో ఉద్యోగాలకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారా..? అయితే మీరు ఖ‌చ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏఐ సాయం తీసుకుని వేలాది కంపెనీలకు ధరఖాస్తు చేసుకున్నా ఒక్క ఉద్యోగం దొరకడం లేదు.

☛ Software Job to Driver Job : సాఫ్ట్‌వేర్ జాబ్ పోయి.. డ్రైవర్ జాబ్ వ‌చ్చా.. కానీ..

ఇలాంటి కఠిన సమయాల్లో నచ్చిన కంపెనీలో..

arificial inteligence jobs news telugu

ఆర్ధిక మాంద్యం భయాలు, లేఆఫ్స్‌, ప్రాజెక్ట్‌ల కొరత.. ఇలాంటి కఠిన సమయాల్లో నచ్చిన కంపెనీలో కోరుకున్న జాబ్‌ పొందడం అంటే అంత సులభం కాదు. అయినప్పటకీ ఓ ఐటీ ఉద్యోగి జాబ్‌ కోసం వినూత్నంగా ఆలోచించాడు. ఫలితంగా.. యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ ఆటోమెషిన్‌లో విధులు నిర్వహించే జూలియన్‌ జోసెఫ్‌ రెండేళ్లలో రెండు సార్లు ఉద్యోగం (లేఆఫ్స్‌) పోగొట్టుకున్నాడు. ప్రయత్నాల్ని విరమించకుండా కొత్త జాబ్‌కోసం ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇందుకోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత సేవంలందించే ‘లేజీ అప్లయ్‌’ వెబ్‌పోర్టల్‌ని ఆశ్రయించాడు.

☛ Samhita Microsoft Job Rs.52 lakh Salary :లక్కీ ఛాన్స్ అంటే ఈమెదే.. ప్ర‌ముఖ కంపెనీలో జాబ్.. రూ. 52 లక్షల జీతం.. ఎలా అంటే..?

ఈత‌ను 5000 ఉద్యోగాలకు అప్లయ్‌.. కానీ.. 
లేజీ అప్లయ్‌లో ఏఐ జాబ్‌జీపీటీ అనే సర్వీసులున్నాయి. దీని సాయంతో నెలకు 250 డాలర్లు వెచ్చించి సింగిల్‌ క్లిక్‌తో వేలా ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకోవచ్చు. కేవలం అభ్యర్ధి వివరాలు ఇస్తే సరిపోతుంది. జోసెఫ్‌ అదే పనిచేశాడు. ఉద్యోగం కోసం తన స్నేహితురాలి ల్యాప్ ట్యాప్‌ తీసుకుని రేయింబవళ్లు శ్రమించి 5వేల ఉద్యోగాలకు అప్లయ్‌ చేసుకున్నాడు. ఆపై కంగుతినడం జోసెఫ్‌ వంతైంది. ఎందుకంటే? వేలాది సంస్థల్లో ఉద్యోగం కోసం ధరఖాస్తు చేసుకుంటే.. కేవలం 20 సంస‍్థలనుంచి ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. పైగా తాను మ్యానువల్‌గా 300 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటే 20 ఇంటర్య్యూ కాల్స్‌ వచ్చాయని జోసెఫ్‌ తెలిపాడు.

☛ Children's Talents : వీళ్లు పిల్ల‌లు కాదు.. చిచ్చరపిడుగులు.. ఎందుకంటే..?

సక్సెస్‌ రేటు తక్కువే..

it jobs news telugu 2023

కొన్ని సార్లు అప్లికేషన్‌లోని ప్రశ్నలకు ఈ ఏఐ సంబంధం లేని సమాధానాలను అందిస్తుండటడంతో స్పందన కరువైంది. సమయం ఆదా అయినప్పటికీ ఏఐ సాయంతో సక్సెస్‌ రేటు తక్కువే అని జోసెఫ్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాబట్టి, ఇంటర్వ్యూల కోసం సన్నద్ధమవుతున్న ఉద్యోగులు ఏఐలాంటి టూల్స్‌తో అప్రమత్తంగా ఉండాలని టెక్నాలజీ నిపుణులు సలహా ఇస్తున్నారు.

అందులో కరోనా మహమ్మారి ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలను ముప్పుతిప్పలు పెట్టి ఆర్థికమాంద్యంలోకి నెట్టివేసింది. ఈ ప్రభావం చాలామంది జీవితాల మీద పడింది. ఇప్పటికి కూడా కొన్నిదేశాల్లోని దిగ్గజ కంపెనీలు సైతం ఆర్థిక మాంద్యం తట్టుకోలేక తమ ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఒకవైపు చదువు కోసం విదేశాలకు వెళ్లిన చాలా మంది భారతీయులు సమస్యలను ఎదుర్కొంటుంటే.. మరికొందరు ఉద్యోగాలు కోల్పోయి అగచాట్లు పడుతున్నారు.

Published date : 13 Nov 2023 04:14PM

Photo Stories