Google : గూగుల్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్.. 10000 మందిని తొలగింపు !
గూగుల్ తన ఉద్యోగులలో 6 శాతం మందిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అంటే దాదాపు 10 వేల మందిని పనితీరు సాకుతో ఇంటికి పంపించనుంది.
Career Tips : మీ ఉద్యోగం పోయిందా..! అయితే వీటికి జోలికి అసలు వెళ్లొద్దు..
దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు..
గూగుల్ ర్యాంకింగ్ సిస్టమ్ ద్వారా త్యల్ప ర్యాంక్ ఉన్న ఉద్యోగులను కంపెనీ నుంచి తొలగించాలని భావిస్తోంది. ఉద్యోగులను విశ్లేషించి, ర్యాంక్ ఇవ్వాల్సిందిగా సంస్థ మేనేజర్‌లను కోరినట్లు సమాచార నివేదిక పేర్కొంది. ఆల్ఫాబెట్ కొత్త పనితీరు సిస్టం బోనస్‌లు ,స్టాక్ గ్రాంట్‌లను చెల్లించకుండా ఉండేందుకు ఈ రేటింగ్స్‌నుపయోగించవచ్చని నివేదిక పేర్కొంది. అయితే దీనిపై ఆల్ఫాబెట్ ఇంకా స్పందించ లేదు. కాగా ఆల్ఫాబెట్ కింద దాదాపు 1,87,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ఫైలింగ్ ప్రకారం, ఆల్ఫాబెట్ ఉద్యోగికి గత సంవత్సరం మధ్యస్థ పరిహారం సుమారు 295,884 డాలర్లుగా ఉంది.
Jobs Layoffs 2022 : అసలు ఎందుకు ఇంత భారీగా ఉద్యోగాలు ఊడుతున్నాయ్.. ఇంకా రానున్న రోజుల్లో ఇది..